‘‘8వ తరగతి చదివే విద్యార్థులు 2వ తరగతి పాఠం చదవలేకతున్నారు’…అసర్ 2024 ‘రాష్ట్రంలో చదువుతున్న ఎనిమిదవ తరగతి విద్యార్థులు కేవలం 24 శాతం మంది తెలుగులో, 20 శాతం మంది గణితంలో, 16శాతం మంది సైన్సులో మరియు సామాజిక శాస్త్రంలో కేవలం 9 శాతం మంది మాత్రమే తరగతి వారి సామర్ధ్యాలు కలిగి ఉన్నారు’ ….NAS
ఒక వైపు కృత్రిమ మేధస్సు, సాంకేతిక విప్లవాలు అంటూ సమా జంలోని ఒక వర్గం దూసుకు పోతు ంటే మరో వైపు హైస్కూల్ స్థాయిలో చదువుతున్న పేద విద్యార్థులకు చదవడం, రాయడం రాదని కూడికలు తీసివేతలు రావని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. విద్యా సామర్థ్యాలను అందించకుండా పాఠశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులు విద్యకు దూరం కావడమే కాకుండా బడికెళ్లిన నిరక్ష్యరాస్యులుగా మారుతారని జాతీయ విద్యా విధానంలో ప్రభుత్వాలను హెచ్చరించింది కూడా. ఈ విద్యార్థులంతా పేద వర్గాలకు చెందిన ఎస్సీ ,ఎస్టీ వెనుకబడిన తరగతులకు చెందిన వారే. నాణ్యమైన విద్యను అందించకుండా ఎన్ని సంక్షేమ పథకాలు అందించినా తరతరాల వెనుకబాటుతనాన్ని అధికమించకపోగా యథాస్థితి కొనసాగుతుంది.
విద్యార్థులందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే వెనుకబాటుతనం నుంచి బయటపడి గౌరవప్రదమైన జీవనం సాగించవచ్చని ఎన్నో ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. ఇంత ముఖ్యమైన అంశం ఎప్పుడు ప్రధాన రాజకీయ చర్చకు రాకపోవడం విచారకరం. అమెరికా విద్యావేత్త, పరిశోధకురాలు లీసా డెల్పిట్ నల్ల జాతీయుల పిల్లల విద్యా విషయంలో విద్యాశాఖ మొత్తం చిన్న చూపు చూస్తుందని వీరంతా ఆ అధికారుల పిల్లలు కానీ నాయకుల పిల్లలు కానీ కాదని ‘మంది పిల్లలు’ కాబట్టే ఈ వివక్షత అని తన ‘ అదర్ పీపుల్స్ చిల్డ్రన్ ’ అనే పుస్తకం లో రాస్తుంది. అన్నట్లు రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన విద్యా హక్కు సామాజిక న్యాయం అనే ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించినట్లే. కేంద్రం ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒక సారి విడుదల చేసే నివేదిక ఈ విషయాన్నే ధృవీకరిస్తోంది.
నేషనల్ అచీవ్ మెంట్ సర్వే
దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణ విద్యార్థుల తెలుగు, లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం అభ్యసన సామర్ధ్యాలు 50 శాతం అంతకంటే తక్కువ శాతం మాత్రమే కలిగి ఉన్నారు.ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులు కేవలం 24 శాతం మంది తెలుగులో, 20 శాతం మంది గణితం లో, 16శాతం మంది సైన్సులో, సామాజిక శాస్త్రంలో కేవలం 9 శాతం మంది మాత్రమే తరగతి వారి సామర్ధ్యాలు కలిగి ఉన్నారు. ఇక ఎస్సీ, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాల విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఇంకా ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక ఈ మధ్యనే విడుదల చేసిన అసర్ నివేదిక ఇంకా ఆందోళన కలిగించేదిగా ఉంది.

అక్షరాలు అంకెలు గుర్తించని ఎనిమిదో తరగతి విద్యార్థులు:
2024 సంవత్సరానికి వార్షిక విద్యాస్థాయి నివేదిక (అసర్) ప్రకారం ప్రభుత్వ బడుల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి తెలుగు పాఠాన్ని తప్పులు లేకుండా చదవలేకపోయారని గత పదేళ్లలో 20 శాతం పెరిగారు. ఇందులో అక్షరాలు గుర్తు పట్టని వారి నుంచి పదాలు గుర్తు పట్టని వారు అలాగే ఒకటవ తరగతి స్థాయి టెక్సట్ చదవలేని వారు కూడా ఉన్నారు. అలాగే లెక్కలలో 44.3 శాతం నుండి 41.1 శాతానికి తగ్గారు. వీరిలో 23 శాతం మంది విద్యార్థులు 1-99 అంకెలను గుర్తించని వారు కూడా ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తెలిసింది. వీరంతా ఎనిమిది సంవత్సరాలు బడులకు వెళ్తున్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులు అత్యధిక శాతం పేద వర్గాల పిల్లలే.
పిల్లల్లో ఇలాంటి అభ్యసన సామర్థ్యాలపై ప్రజా సంఘాలు కూడా పెద్దగా స్పందించినట్లు కనపడదు. నాణ్యమైన విద్య అందించడం రాజకీయ సంకల్పానికి చెందిన అంశంగా ప్రజా సంఘాలు గుర్తించాలి. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే వొచ్చే తరం ముఖ్యంగా ఎస్.సి, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అత్యధిక శాతం పౌరులు చదవడం రాయడం రాని బడికెళ్లిన నిరక్షరాస్యులుగా, నైపుణ్యత లేని కార్మికులుగా మాత్రమే జీవనం గడుపుతారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా కూడా పరిగణించాల్సి వస్తుంది.
భారీ బిల్డింగులు సరే.. నాణ్యమైన విద్య ఇస్తున్నామా?
సమస్య ఇంత జటిలంగా ఉంటే ప్రభుత్వాలు మౌలిక విషయాల మీద, పదుల ఎకరాల స్థలాల్లో పెద్ద పెద్ద భవనాల మీద టీచర్ల వేతన విధానాల మీద పాఠశాలలకు మరమ్మతులు, ప్రహరీ గోడలు, కంప్యూటర్లు , పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటి వాటిని సమకూర్చ డానికి, పర్యవేక్షిం చడానికి పెద్ద సమస్య రాదు. ఎందుకంటే సరఫరాచేసే వాళ్లు, పర్యవేక్షించే వాళ్లు ఏదో ఒక రూపంలో లబ్ది పొందుతారు. ఇవన్నీ బడి అందుబాటులోకి తేవడానికి జరిగే పనులు. బడిని అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి ఛాంబర్ నుండే పర్యవేక్షించవచ్చు. ఈ పనుల వలన భవన నిర్మాణ కాంట్రాక్టులు లభించిన వాళ్ళకు ఆనందంగా ఉంటుంది. స్థానిక నాయకులకు, ప్రముఖులకు అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం అంటే మౌలిక వసతులు కల్పించినంత సులభం కాదు. ఉపాధ్యాయుల నుండి విద్యాశాఖ సెక్రటరీ వరకు జవాబుదారీతనాన్ని నిర్దేశించవలసి ఉంటుంది. వారి పని తనాన్ని సమీక్షవలసి ఉంటుంది. క్లిష్టమైన పనే. కానీ బాలలకు రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కును అందిస్తున్నామని భావిస్తే ఇది సాధ్యమయ్యే పనే అని గుర్తించాలి. అన్నీ పనుల కంటే ఈ పని ముఖ్యమని గుర్తించాలి.

పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ దేశాల పర్యటనలు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంపై ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకోవడం, మూసి సుందరీకరణ, మెట్రో విస్తరణ మొదలు పెడుతున్న స్కీల్ యూనివర్సిటీ, స్పోర్టస్ యూనివర్సిటీ, ఐటీ కారిడార్లు. టి హాబ్‌లు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులతో కలిగే ఉద్యోగ అవకాశాలలో నాణ్యతా లేని చదువులతో అత్యధిక శాతం తెలంగాణ యువత మధ్యలోనే విద్యకు స్వస్తి చెప్పి నైపుణ్యత లేని పనులైన బిల్డింగ్ ల నిర్మాణ కూలీలుగా, ఆఫీస్ బాయ్స్ గా బహుళ అంతస్తుల అద్దాల మేడలను శుభ్రపరిచే రోజు వారి కార్మికులుగా మిగిలిపోతారని గ్రహించాలి.
ప్రాథమిక స్థాయిలో దృష్టి పెట్టాలి:
కొందరు కలెక్టర్లు పదో తరగతి ఫలితాలు బాగా రావాలని విద్యార్థుల ఇళ్లను సందర్శించారని వార్తలు వొచ్చాయి. అలాగే ప్రతి జిల్లాలలో హైస్కూల్ హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహించి ఫలితాలపై హెచ్చరికలు కూడా చేసినట్లు తెలిసింది. వొత్తిడి పెంచడంతో ఫలితాలు రావడానికి ఏం చేయాలో ఉన్నత అధికారులను ఎలా సంతృప్తి పర చాలో అ ర్ధం చేసు కున్నారు. ఫలితాలను తెచ్చి చూపి స్తున్నారు కూడా. ఇంకా కొన్ని సందర్భాలలో ఫలి తాల వొత్తిడి తట్టుకోలేక చూసి కూడా రాయ లేని విద్యా ర్థులను ప్రైవేటు విద్యా ర్థులుగా లే దా ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసుకో వాలని సలహాలు ఇస్తున్నట్లు క్షేత్రస్తాయి సమాచారం బట్టి తెలుస్తుంది.

నేర్పడం లేదా!! నేర్వడం లేదా !!
విద్య పై జరిగే చర్చల్లో పిల్లల వైపు తల్లిదండ్రుల వైపునకు చర్చపోతుంది. తల్లిదండ్రులు పట్టించుకోరని విద్యార్థుల వేశా భాష సరిగా లేదని, మాట వినడం లేదని స్మార్ట్ ఫోన్ల వల్ల మాట వినడం లేదని కొన్ని సంఘటలను ఉదహరించి మొత్తం విద్యార్థి లోకం ఈ కోవకే చెందిన్నట్లు చర్చలు జరుగుతుంటాయి. అంతే గానీ విద్యా శాఖలో అధికారులు మాత్రం బాధ్యత వహించినట్లు కనిపించదు. పిల్లలు నేర్వడం లేదా లేక నేర్పడం లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. నేర్పించినట్లితే పిల్లలందరు నేర్వ గలరని అన్ని విద్యా శాస్త్రాలు చెపుతూనే ఉన్నాయి. నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే ఒక తరాన్ని నిర్లక్ష్యం చేసినట్లు అవుతుంది. రాష్ట్రం లో 58 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు బడులలో చదువుతున్నారు. కనీసం ప్రభుత్వ బడుల్లో విద్యా విషయాలపై చర్చ అయినా జరుగుతుంది. ప్రైవేటు స్కూళ్లలో నాణ్యతను పర్యవేక్షించే వారే లేరు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు వెళ్లే ప్రైవేటు బడుల స్థితి ఆశాజనకంగా లేదు.

తక్షణ కర్తవ్యం :
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని అత్యవసర పరిస్థితిగా గుర్తించాలి. పరిష్కార మార్గాలు యుద్ద ప్రాతిపదికన వేతకాలి. ఒక స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థను ఏర్పాటు చేసి నాణ్యత అందించడంలో ప్రతి పాఠశాలను ప్రమాణాలను రూపొందించాలి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రతి పాఠశాల ప్రమాణాలను గుర్తించి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలి.

విద్యా హక్కు చట్టం సెక్షన్ 27 ప్రకారం టీచర్లను బోదనేతర పనుల నుంచి విముక్తి చేయాలి. టీచర్లకు తమ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను బట్టి టీచర్లు ప్రణాళికలు వేసుకుని బోధించాలి. టీచర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. విద్యా సామర్ధ్యాలు పెంచడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలీ. సిలబస్ పక్కన పెట్టి ఒక మూడు నెలలు రాష్ట్రమంతా చదవడం రాయడం అనే విద్యా ఉద్యమంగా కొనసాగించాలి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి పాఠశాల వరకు ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం విద్యా సామర్థ్యాల పెంపుపై ఫోకస్ పెట్టాలి. విద్యా శాఖలో ఉన్న అధికారులందరూ ఒక మండలం బాధ్యత తీసుకోవాలి. కొన్ని నెలలు కార్యాలయాల నుంచి బయట పడాలి. ప్రతినెల అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్య పురోగతి మీదనే సమీక్షలునిర్వహించే విధానాన్ని రూపొందించాలి.
రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు పార్టీల కతీతంగా తమ తమ నియోజిక వర్గాల్లో విద్య పురోగతిని సమీక్షించాలి. గ్రామ సభల్లో విద్య అంశం మొదటి అజెండాగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఉద్యమ రూపం తీసుకోవాలి. వివధ అంశాల పట్ల రాజకీయ వొత్తిడులు పెడుతున్న ప్రజా సంఘాల అజెండా లో తొలి అంశంగా నాణ్యమైన విద్య ఉండాలి. చివరగా నాణ్యమైన విద్యను అందుకోవడం బాలల హక్కు. అందించడం ప్రభు త్వాల బాధ్యత. అప్పుడే రాజ్యాంగ మూల సూత్రమైన సమ న్యాయం అందినట్లు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయి నుంచి పాఠశాల సిబ్బంది వరకు ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లోని లక్షలాది మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని గ్యారంటీ నివ్వాలని ఆశిద్దాం.