ఆర్థిక విధ్వంసంతో అభివృద్ధికి పాతర

పదేళ్ల పాలనలో వెయ్యేళ్ల సంపాదన
అప్పులతో రాష్ట్రాన్ని దివాలా  తీయించిన కెసిఆర్‌
రైతుభరోసాపై చర్చలో బిఆర్‌ఎస్‌ను కడిగేసిన  సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ఆర్థిక విధ్వంసం సృష్టించి,అభివృద్దిని అడ్డుకున్న బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై సిఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎందరో బలిదానాలతో ఇచ్చిన తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని అన్నారు. ఇప్పటికీ అభివృద్దిని అడ్డుకుంటూ కాళ్లల్లో  కట్టెలు పెడుతున్నారని, వీరిని ఎలా ఆదర్శంగా తీసుకుని పాలించగలమని ప్రశ్నించారు. అప్పుల కారణంగా వడ్డీలకే సంపాదన సరిపోతుందని లెక్కలతో సహా వివరించారు. గత ఆర్థిక మంత్రి తప్పుడు లెక్కలతో ఆర్‌బిఐని కూడా మోసం చేశారని అన్నారు. అలాగే రైతుబంధు పేరుతో రాళ్లూ రప్పలు, ప్లాట్లు, రోడ్లకు నిధులు ఇచ్చారని అంటూ..ఇప్పుడూ అలాగే చేయాలనడం దుర్మార్గమని అన్నారు. రైతులను ఆదుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.  ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పై సీఎం రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం.. బీఆర్‌ఎస్సేనని మండిపడ్డారు. తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు.. వాళ్ళు తెచ్చిన అప్పుకు 11.5 వేలకోట్లు వడ్డీ అని అన్నారు. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటాం.. బి ఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన ఆర్ధిక విధ్వంసానికి  వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళని ఆరోపించారు. దిల్లీకి నేను వెళ్తుంది.. ఆర్థిక శాఖ న్యాయ నిపుణుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి వొచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు.. హాస్టల్‌లకు విూరేం చేశారని బీఆర్‌ఎస్‌ ను సీఎం ప్రశ్నించారు. హాస్టల్‌ కట్టలేదు..

అమ్మాయిలకు టాయ్‌లెట్‌ కట్టలేదన్నారు. నాలుగు గంటల తరబడి  క్యూ కట్టాల్సిన పరిస్థితి.. పదేళ్ల పాలనలో బాత్‌రూం కూడా కట్టనందుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ఆయన సభకు రావడం లేదు.. వొస్తే కడిగేద్దాం అని ఏడాది నుండి చూస్తున్నానని పరోక్షంగా కెసిఆర్‌ గురించి అన్నారు. విూరెంత.. విూ స్థాయి ఎంత.. నా నిబద్ధతను విూరా ప్రశ్నించేదని తీవ్ర స్థాయిలో సీఎం మండిపడ్డారు. పేపర్‌ దిద్దలేని విూరు.. టీఎస్పీఎస్సీ పరీక్ష పెట్టలేని విూరు.. నన్నా అడిగేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ దొంగ లెక్కలు చూపించలేదు.. ఆర్థికమంత్రిగా ఈటల రాజేందర్‌ కూడా దొంగ లెక్కలు చూపలేదు.. కానీ కేసీఆర్‌ తరవాత వొచ్చిన హరీష్‌ దొంగ లెక్కలు రాశాడని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ పెద్దమనిషి పని ఎట్లా ఉందంటే.. ప్రశ్నపత్రం నువ్వే రెడీ చేసి..

నువ్వే సమాధానం చెప్పి.. నువ్వే ఎక్కువ మార్కులు వేసుకుని ఇదే నా ఘనత అంటున్నాడని విమర్శించారు. అప్పులు ఎక్కడ ఉన్నాయో.. తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడనివ్వండని అన్నారు. తమ చేతులు విరగొట్టాలని చూస్తున్నారని, పాలన చేయకుండా, అభివృద్ది సాగకుండా చేయాలని చూస్తున్నారని  బీఆర్‌ఎస్‌ పై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు..స్కిల్‌ వర్సిటీ కోసం అదానీ రూ.100 కోట్లు ఇచ్చారు. దీనిపై ప్రతిపక్షం చేసిన నానాయాగీ వల్ల ఆ మొత్తాన్ని అదానీకి తిరిగి ఇచ్చాం. రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడం వల్ల రాష్ట్రానికి నష్టం. రెండు సార్లు సీఎం అయ్యి.. వందేళ్ల విధ్వంసం చేసి.. వెయ్యేళ్లకు సరిపడా విూరు సంపాదించుకున్నారు’ అని సీఎం ఆరోపించారు. తొమ్మిదిన్నర ఏళ్ల భారాస పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని.. పదేళ్లు కష్టపడి కేసీఆర్‌ ‘కూలేశ్వరం’ కట్టారని సీఎం ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page