రాష్ట్రంలో పెట్టుబడులను అడ్డుకునే కుట్ర

– గుజరాత్‌కు బ్రాండ్‌ అం‌బాసిడర్‌గా మోదీ
– సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా ప్రధాని వ్యవహారం
– అమెరికా టూర్‌ ‌రద్దును ఊరికే వొదలబోం
– పార్లమెంటులో కాంగ్రెస్‌ ‌ఖచ్చితంగా నిలదీస్తుంది
– నన్ను అడ్డుకున్నా.. నా లక్ష్యాన్ని అడ్డుకోలేరు
– మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ ‌మండిపాటు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌పెట్టుబడుల సాధన కోసమే విదేశీ పర్యటనకు సంకల్పించామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే, దురుద్దేశపూర్వకంగా తన అమెరికా పర్యటనను కేంద్రం తిరస్కరించిం దని ఆరోపించారు. రాష్ట్రాలకు కేంద్రం సహకరించాలనేదే సమాఖ్య స్ఫూర్తి అని తెలిపారు. అందుకు విరుద్దంగా కేంద్ర విధానాలు ఉన్నాయన్నారు. వికసిత్‌ ‌భారత్‌ 2047‌లో భాగంగా తెలంగాణ రైజింగ్‌ 2047‌ను ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. లండన్‌ ‌నుంచి తిరిగి వచ్చిన తరవాత సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ట్రిలియన్‌ ‌డాలర్ల ఎకానమీ తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ద్వారా తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధి దిశగా వెళ్లాలనేదే తమ యోచన అని పేర్కొన్నారు.  మోదీ ఇంకా గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిలానే వ్యవహరిస్తున్నారని.. దేశానికి ప్రధాన మంత్రిగా వ్యవహరించడం లేదని సీఎం విమర్శించారు. గుజరాత్‌ ‌నేతలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. గుజరాత్‌ ఆధిపత్యానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. గుజరాత్‌ ‌సీఎంకు అనుమతి ఇచ్చి.. తెలంగాణ సీఎం పర్యటనకు నిరాకరించడం నాలుగు కోట్ల ప్రజలకు జరిగిన అవమానం అన్నారు. ఇది స్పష్టమైన రాజకీయ వివక్ష, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌పేరుతో ఆ రాష్ట్ర సీఎం అమెరికాలో ర్యాలీలు చేశారని, పెట్టుబడుల కోసం ఎనిమిది రోజులు అక్కడ పర్యటించిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్‌ ‌గుర్తు చేశారు. గుజరాత్‌ ‌సీఎంకు అనుమతి ఇచ్చి.. తమ పర్యటనను ఎందుకు అడ్డుకున్నారో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం పదే పదే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్‌కు మళ్లించుకొనేందుకు కుట్రలు చేశారంటూ మండిపడ్డారు. టీబీజేపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. విచక్షణ కోల్పోయి ప్రభుత్వం, తన అధికారిక పర్యటనలపై బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. బీజేపీ నేతలపై ఆరోపణలు చేయదలచుకోలేదని.. ఎందుకంటే వారికి ఆ స్థాయి లేదంటూ వ్యాఖ్యానించారు. పెట్టుబడుల సాధన కోసం గతంలోనూ విదేశీ పర్యటనకు వెళ్లామని వివరించారు. దిల్లీలో ఉన్న కొందరు బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తన అధికారిక పర్యటనపై కేంద్రానికి అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. ’మేము ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నా పర్యటన పూర్తి వివరాలు కేంద్రానికి ఇచ్చాం. విద్య, క్రీడల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని సంకల్పించాం. అమెరికా పర్యటనలో ప్రఖ్యాత యూనివర్సిటీలు, పెట్టుబడిదారులను కలుస్తామని కేంద్రానికి చెప్పాం. రాజకీయ కారణాల వల్ల అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ మాకు బదులిచ్చిందని అన్నారు. అందుకే  ఇంగ్లండ్‌ ‌పర్యటనకు అనుమతి ఇచ్చారు.. అమెరికా పర్యటనను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. గుజరాత్‌ ‌సీఎంకి అమెరికా, కెనడా పర్యటనలకు అనుమతిచ్చారు. నా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణ ప్రజలను అవమానించడమే. తిరస్కరణకు రాజకీయ కారణాలు చెబుతున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.టీబీజేపీ ఎంపీలు గుజరాత్‌ను సపోర్ట్ ‌చేస్తున్నారా? టీబీజేపీ ఎంపీలకు తెలంగాణ అభివృద్ధి అవసరం లేదా? అని ప్రశ్నించారు. ’నా పర్యటనను అడ్డుకోవడమంటే.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. నా పర్యటనను అడ్డుకోవడం తెలంగాణపై వివక్ష చూపించడమే. నా పర్యటనను అడ్డుకున్నారు.. మా లక్ష్యాలను అడ్డుకోలేరు. నాది చాటుమాటు పర్యటన కాదు.. అధికారిక పర్యటన. విదేశాల్లో ఉండగా స్పందిస్తే.. దేశద్రోహి అనేవారు. అందుకే ఇక్కడికి వచ్చి కేంద్రం వైఖరిపై మాట్లాడుతున్నా. ఏ విదేశీ పర్యటన అయినా భారత ఎంబసీ పర్యవేక్షిస్తుంది. మా పర్యటన వివరాలను వారే కేంద్రానికి తెలియజేస్తారు. ఇందులో రహస్యం ఏముంది’ అని ప్రశ్నించారు. కేంద్రానికి తెలంగాణ అంటే చులకన, చిన్నచూపు అంటూ రేవంత్‌ ‌వ్యాఖ్యానించారు. తన పర్యటనను అడ్డుకోవడం పూర్తిగా వివక్షే అని అన్నారు. ఈ అంశాన్ని రాహుల్‌, ‌ఖర్గే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. విదేశాంగశాఖ అధికారి బీజేపీలో చేరడం మంచిదని హితవుపలికారు. కాంగ్రెస్‌ ‌సీఎంననే తన పర్యటనను అడ్డుకున్నారని ఆరోపించారు. మెట్రో సహా చాలా అంశాల్లో కేంద్రం సహకరించట్లేదన్నారు. సబ్‌ ‌కా సాత్‌, ‌సబ్‌ ‌కా వికాస్‌ అం‌టే ఇదేనా అని ప్రశ్నించారు. మోదీకి బీజేపీ పాలిత రాష్టాల్రు తప్ప.. ఇతర ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదన్నారు. కేంద్రం వివక్షను సహించేది లేదని సీఎం రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నన్ను అడ్డుకున్నా. నా లక్ష్యాన్ని అడ్డుకోలేదన్నారు. డిసెంబర్‌లో ఫ్యూచర్‌ ‌సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తాం. హైదరాబాద్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తాం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్‌ ‌నాయకత్వం కుట్ర చేస్తోంది. మన రాష్టాన్రికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యం. తెలంగాణపై గుజరాత్‌ ఆధిపత్యాన్ని అందరూ ఖండించాలి. ప్రధాని మోదీ గుజరాత్‌కు బ్రాండ్‌ అం‌బాసిడర్‌ ‌మాదిరిగా వ్యవహరిస్తున్నారు. భారత్‌కు వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్‌కు రావాలని మోదీ చూస్తున్నారు. తెలంగాణ సీఎం పర్యటనను అడ్డుకోవడం గురించి పార్లమెంటులో లేవనెత్తుతాం. దీన్ని వదిలిపెట్టేది లేదు. మమ్దానీ న్యూయార్క్ ‌ప్రజలు ఎన్నుకున్న మేయర్‌. ఆయనే అసాంఘిక శక్తికాదు కదా అని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా పాక్‌ ‌వెళ్లి ఆయన మిత్రుడితో కలిసి బిర్యానీ తిని రాలేదా? మేం మాత్రం పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లకూడదా? మోదీ ప్రధాని అయ్యాక ప్రజాస్వామ్యం సన్నగిల్లింది. నిరంకుశత్వం పెరిగింది. మోదీ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం.. ఆయన వైఖరితో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటున్నాయి. బీఆర్‌ఎస్‌ ‌నేతలు హరీశ్‌, ‌కేటీఆర్‌, ‌కవిత పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. వారికి అమెరికా పర్యటనలకు అనుమతులు వస్తున్నాయి. సీఎంగా నా పర్యటనకు మాత్రం అనుమతి ఇవ్వడంలేదు. నేనూ హార్వర్డ్ ‌యూనివర్సిటీలో చదివాను. ఒప్పందాల విషయంలో అమెరికా నుంచి నాకు ఆహ్వానం ఉందన్నారు. విలేక‌రుల‌ స‌మావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీతక్క, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

———————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *