– ముంబై దాడులకు ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు
~ అందుకు అడ్డుపడిందెవరు?
~ మాకు జాతీయ భద్రతే ముఖ్యమన్న ప్రధాని మోదీ
ముంబై, అక్టోబర్ 8: ముంబై ఉగ్రవాద దాడుల(2008 ) తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘బలహీనత‘ను ప్రదర్శించిందని ప్రధాని మోడీ ఆరోపించారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11 దాడులకు తెగబడ్డారని అన్నారు. ఇటీవల, కాంగ్రెస్ మాజీ హోం మంత్రి పి. చిదంబరం ముంబై ఉగ్రదాడుల గురించి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల తాము పాకిస్తాన్‌పై దాడి చేయలేదని చెప్పారు. ముంబై దాడుల తర్వాత మన భద్రతా దళాలు పాకిస్తాన్‌పై దాడి చేయడానికి సిద్ధమయ్యాయయని, కానీ వేరే దేశం ఒత్తిడి కారణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా బలగాలను ఆపిందని చిదంబరం అన్నారు. దీనిపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏ దేశం ఒత్తిడి తెచ్చిందో వెల్లడిరచాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ బలహీనత ఉగ్రవాదుల్ని బలపరిచిందని, ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా దేశం పదే పదే ఉగ్రవాదానికి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. ఉగ్రదాడి అనంతరం సైనిక చర్యను అడ్డుకుంటూ ఆనాడు నిర్ణయం తీసుకున్నదెవరో చెప్పాలని కాంగ్రెస్‌ను నిలదీశారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లో ముంబై ఒకటి కావడంతోనే ఉగ్రవాదులు దానిపై దాడి చేశారన్నారు. నాటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కాంగ్రెస్ చెప్పాలని, దేశ ప్రజలకు ఈ విషయం తెలియాలని అన్నారు. కాంగ్రెస్ చూపించిన బలహీనతే ఉగ్రవాదులకు బలంగా మారిందన్నారు. జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడిరదని ఆక్షేపించారు. తమ ప్రభుత్వానికి దేశం, దేశ పౌరుల భద్రతే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో మిలటరీ యాక్షన్ చేపట్టామని గుర్తు చేశారు. ఉగ్రవాదంపై తమ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు.మన దేశ భద్రత, పౌరుల భద్రత కన్నా మరేది ముఖ్యం కాదని మోదీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ ప్రస్తావిస్తూ, నేటి భారతదేశం తన శత్రువులను వారి ఇళ్లలోకే వెళ్లి హతమారుస్తోదని ప్రధాని అన్నారు. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘వికసిత్ భారత్‘ను ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని ప్రధాని అన్నారు. కొత్త విమానాశ్రయం ద్వారా మహారాష్ట్రలోని రైతుల ఉత్పత్తులు మిడిల్ ఈస్ట్, యూరప్ మార్కెట్లతో అనుసంధానించబడుతాయని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





