దివ్యాంగులనూ మోసం చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: దివ్యాంగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకొచ్చాక తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులతో సమావేశమయ్యారు. తమ సంక్షేమం పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెన్షన్‌ పెంచుతామని చెప్పి అమలు చేయకుండా మోసం చేసిందని, ఆధునిక ఉపకరణాల పంపిణీ, ప్రత్యేక ఉపాధి కోటా వంటి హామీలు గాలిలో కలిశాయని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులు సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు పొందేలా బీజేపీ కృషి చేస్తుందని రాంచందర్‌ రావు వారికి భరోసా కల్పించారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, హియరింగ్‌ ఎయిడ్స్‌ వంటి ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేస్తోందని, దివ్యాంగుల ఉపాధి అవకాశాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్‌ అమలు చేస్తోందని, నేషనల్‌ హ్యాండిక్యాప్డ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధికి రుణ సహాయం అందిస్తోందని వివరించారు. దివ్యాంగుల హక్కులను కాపాడగల పార్టీ బీజేపీ ఒక్కటేనని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో దివ్యాంగులు బీజేపీకి మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్‌కు గట్టి బుద్ధి చెప్పే సమయం ఇదేనని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page