– మరింతగా తగ్గుతుందన్న అంచనాలు
హైదరాబాద్, అక్టోబర్ 28: దీపావళి పండుగ సమయంలో ఉవ్వెత్తున ఎగసిన పసిడి ధర మకొంత దిగొచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4 వేల డాలర్ల స్థాయి దిగువకు చేరింది. అమెరికా` చైనా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదరొచ్చన్న అంచనాలు ఈ దిద్దుబాటుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ఈనెల 30న జరిగే భేటీలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకుల అంచనా. అంతర్జాతీయ ధరలననుసరించి దేశీయంగానూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఇటీవలి వరకూ చుక్కలనంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మంగళవారం కూడా పసిడి, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోలిస్తే రూ.820 మేర తగ్గి రూ.1,22,460కు చేరుకుంది. ఇక ఆభరణాల బంగారం ధర రూ.750 మేర తగ్గి 1,12,250కు చేరుకుంది. వెండి ధరల్లో కూడా భారీ కోత పడిరది. కిలో వెండి ధర రూ.4 వేల మేర తగ్గి రూ.1,51,000కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,22,460గా ఉంది. ఆభరణాల బంగారం ధర రూ.1,12,250గా ఉంది. కిలో వెండి ధర మాత్రం రూ.1.65 లక్షలుగా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. ఔన్స్ 24 క్యారెట్ బంగారం 3986 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సోమవారంతో పోలిస్తే సుమారు 3 శాతం ధరల్లో కోత పడిరది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కూడా 2.35 శాతం మేర తగ్గి రూ.1,20,546 వద్ద కొనసాగుతోంది. మలేషియా వేదికగా అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయి. ఎగుమతులపై నియంత్రణలు, డ్రగ్స్ కట్టడి, షిప్పింగ్ లెవీల వంటి వాటిపై ఇరు దేశాల మధ్య ప్రాథమిక స్థాయిలో ఏకాభిప్రాయం కుదరడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. టిక్‌టాక్ విక్రయంపై భేదాభిప్రాయాలు తొలగిపోయాయని, చైనాపై 100 శాతం సుంకం కూడా ఉండబోదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ ప్రకటించడంతో మళ్లీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఆకర్షణీయంగా మారాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం కూడా మదపర్లకు కొత్త ఊపునిచ్చింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





