లక్ష్మారెడ్డి మృతికి టీయూడబ్ల్యూజే, ఐజేయు సంతాపం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి (84) మృతి పట్ల ఐజేయు జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా  అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.విరాహత్ అలీ, కె.రాంనారాయణ, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కె.రాములు ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన లక్ష్మారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా, ఏపీ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా పలు హోదాల్లో పని చేశారని పేర్కొన్నారు. 1999, 2014 లో రెండు పర్యాయాలు లక్ష్మారెడ్డి హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారన్నారు. జర్నలిజం వృత్తి పట్ల గల ఆసక్తి,  నిబద్ధత కారణంగా 1980లో ఆయన న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (ఎన్ఎస్ఎస్) అనే ఒక వార్తా సంస్థ ప్రారంభించారని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జర్నలిస్టుల సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా,  ఉమ్మడి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా జర్నలిస్టులకు లక్ష్మారెడ్డి సేవలందించారని వారు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజేలో లక్ష్మారెడ్డి తో కలిసి పనిచేసిన సందర్భాలను, ఆయన సేవలను ఈ సందర్బంగా వారు గుర్తు చేసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page