యువర్ సిటీ 100 యాప్‌లో సమగ్ర సమాచారం

కాళోజి జంక్షన్/హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : సమాజంలో వ్యాపార అవకాశాలను విస్తృత పరుచుకోవడానికి యువర్ సిటీ 100 యాప్ సాంకేతికత పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పులి అవినాష్ రూపొందించిన యాప్‌ను కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాదులో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల నుంచి అగ్రశ్రేణి వ్యాపారుల వరకు తమ సమాచారాన్ని తమ వింతలు, విశేషాల సమగ్ర సమాచారం యువర్ సిటీ 100 యాప్ ద్వారా పొందవచ్చన్నారు. అమెరికాలోని బొట్సిన్ ఎల్ సి సితో కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌తో కుదుర్చుకున్న ఎంఓయూ ద్వారా రాజా నరేందర్ రెడ్డి నేతృత్వంలోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ తో కలిసి ఆధునిక సాంకేతిక యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా ‘కిట్స’ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణ రెడ్డి, కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డిలు అధ్యాపకులను అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *