ఇది రక్త సంబంధం కాదు… అంతకంటే ఎక్కువ

“ఇది రక్త సంబంధం కాదు…
అంతకంటే ఎక్కువ
వనపర్తిలో విద్యాభ్యాసం చేస్తూ…
ఆ నాడు అక్క ఇంట్లో ఆత్మీయతను …
ఆస్వాదిస్తూ పెరిగా…
ఈ నాడు ఆ జ్ఞాపకాలను మోసుకుని…
ముఖ్యమంత్రిగా అక్క ఇంటికి వెళ్లా..”

పార్వతమ్మ కుటుంబాన్ని కలుసుకున్న సీఎం రేవంత్..

CM Revanth Reddy

వనపర్తి ప్రజాతంత్ర మార్చి 2: వనపర్తిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిన తనకు సొంత సోదరిలా ప్రేమ ఆప్యాయత చూపిన పార్వతమ్మ కుటుంబాన్ని ముఖ్యమంత్రి హోదాలో కలిసి కలవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం వనపర్తి పట్టణానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వొచ్చిన తాను ముఖ్యమంత్రి హోదాలో తన అక్క అయిన పార్వతమ్మ ఇంటికి రావడం పట్ల పార్వతమ్మ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని ఆప్యాయంగా సాధారంగా ఆహ్వానించారు. గతంలో వనపర్తి పట్టణంలోని పార్వతమ్మ గృహంలో అద్దెకు ఉండి ఇంటర్ వరకు చదివిన పాత జ్ఞాపకాలను ముఖ్యమంత్రి గుర్తు తెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పార్వతమ్మ కుటుంబ సభ్యులను ఆప్యాయతగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన ఇంటికి తన తమ్ముడు రావడం పట్ల పార్వతమ్మ ఆనంద బాష్పాలతో స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి మధుసూదన్ రెడ్డి, నాయకులు ఒబేదుల్లా కొత్వల్, సాయి చరణ్ రెడ్డి, శివసేనారెడ్డి, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *