హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెళ్ళలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంలో భాగంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




