Category తెలంగాణ

యాదాద్రిలో వైభ‌వంగా నీరాట్టోత్స‌వాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు గోదా అమ్మవారి నీరాట్టోత్సవలు ఆల‌యంలో  అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు గోదా అమ్మవారికి పంచామృతాలతో నవ కలశ సన్నపనం నిర్వహించారు తదుపరి లక్ష్మి…

చైనా మాంజా విక్రయాలపై నివేదిక ఇవ్వండి

– హైదరాబాద్‌ ‌సీపీ ని ఆదేశించిన మానవ హక్కుల కమిషన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 13: చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ‌సీరియస్‌ అయింది. దీనిపై ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది. బ్యాన్‌ ‌చేసిన చైనా మాంజా వాడకం వల్ల జరుగుతున్న గాయాలు,…

‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్‌ యాప్‌ను ప్రారంభించిన డీజీపీ

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 13: రక్తం అవసరమైన వారికి తక్షణమే దాతలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో రూపొందించిన ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ వెబ్‌ అప్లికేషన్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.రక్తదాతలు –పేషెంట్ల మధ్య వేగంగా సమాచారం అందేలా ఈ వెబ్‌ యాప్‌ను రూపొందించారు. రక్తం అవసరమైన సమయంలో దాతను…

రేవంత్‌పై చేసిన‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

– ఆవేశంతో చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదు – సికింద్రాబాద్‌పై రాజీ లేని పోరాటం చేస్తాం – 17న శాంతి ర్యాలీ చేపడున్నట్లు ప్రకటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని ఉద్దేశించి తాను చేసిన‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌స్పందించారు. మంగళవారం ఆయ‌న‌…

ఇందిరమ్మ ఇండ్ల ఎల్‌-3 లబ్దిదారులకు ఊరట

– రూ.12 కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టిన తరువాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్‌-3 కేటగిరీ లబ్దిదారులకు సంబంధించిన బిల్లులను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1072 మంది…

నాలుగోసారి కూడా వాత తప్పదు

– బీఆర్‌ఎస్‌ నేతలు విషం నింపుకుని కారుకూతలు కూస్తున్నారు – నాటి ‘ప్రభువుల’కు ప్రజలే బుద్ధి చెబుతారు – కాంగ్రెస్‌ సర్పంచుల సన్మాన సభలో మంత్రి పొంగులేటి అశ్వారావుపేట, ప్రజాతంత్ర, జనవరి 13: అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా గత పాలకులకు ఇంకా జ్ఞానం రాలేదని, ఒళ్లంతా విషం నింపుకొని…

సమ్మక్క సారక్క పాట సీడీ ఆవిష్కరించిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్‌ తన బృందంతో కలిసి రచించి, పాడి, వీడియోగా చిత్రీకరించిన సమ్మక్క సారక్క పాట సీడీనీ ప్రజా భవన్‌లో మంత్రి దనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. ఈ పాటలో మంత్రి…

మీ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలి

– విద్యుత్‌ సంఘాల డైరీ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: ప్రజల జీవితాలకు సంబంధించిన వెలుగులు అందించడమే కాకుండా ఉద్యోగుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వంలో పవర్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు అందరికీ ఆయన నూతన…

మెద‌క్ జిల్లా మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగ‌రాలి

– నిర్వ‌హ‌ణ లేక క‌ళ త‌ప్పిన మున్సిపాలిటీలు – కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డంలేదు – మున్సిపాలిటీల్లో ప‌డ‌కేసిన పారిశుద్ధ్యం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి హరీష్…