Category తెలంగాణ

తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయానికి ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ సంక్రాంతి. కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన ఆనందాన్ని కుటుంబీకులతో, స్నేహితులతో, పొరుగువారితో పంచుకునే అపూర్వమైన సందర్భం ఇది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే ఈ సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల…

మానుకోట‌ పట్టణాభివృద్ధికి రూ.59.62కోట్లు

– పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన మ‌హ‌బూబాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 13: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్ర‌భుత్వం సమన్వయంతో అమలు చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబాబాద్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులకు…

పిన‌పాక మండ‌లంలో పురావ‌స్తు శాఖ త‌వ్వ‌కాలు

– ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంగా గుర్తింపు – ఇనుప‌ యుగం నాటి నాగ‌రిగ‌త అధ్య‌యనం ల‌క్ష్యం పినపాక, ప్రజాతంత్ర, జనవరి 13 : పురావస్తు శాఖ‌ (ఏఎస్ఐ) హైదరాబాద్ సర్కిల్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దేవనగరం–పాండురంగాపురం గ్రామ పరిధిలో ఉన్న ప్రాగైతిహాసిక మెగాలిథిక్ స్థలంలో మంగళవారం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈ తవ్వకాలను…

యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్‌తో సీఈవో భేటీ

– డిజిటల్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే మార్గాలపై చర్చలు బ్రస్సెల్స్/హైదరాబాద్, జనవరి 13: ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్‌మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్‌తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో…

మున్సిప‌ల్ పోరులో ఒంటిగానే బ‌రిలోకి

– బీజేపీ నాయ‌కుడు కాదూరి యాచ‌య్య‌ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 13: దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ కి దక్కింద‌ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ బోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు…

విజయవాడ రహదారిలో కొనసాగుతున్న రద్దీ

– భారీగా వాహనాల రాకతో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: సంక్రాంతి సెలవులు రావడంతో పట్నం పల్లె బాట పట్టింది. శనివారం నుంచే స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ఆదివారం వరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ఎల్బీ నగర్‌, ఎం‌జీబీఎస్‌, ‌జేబీఎస్‌, ‌శివారులోని ఉప్పల్‌ ‌రింగ్‌ ‌రోడ్‌, ‌కూకట్‌పల్లి, ఆరంఘర్‌ ‌చౌరస్తా, గచ్చిబౌలి,…

మున్సిపాలిటీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– రూ.12.3 కోట్ల పనులకు శంకుస్థాపనలు – దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభం – త్వరలో నూతన పింఛన్లు, రేషన్ కార్డులు – దుబ్బాకకు మరిన్ని నిధులు తీసుకొస్తాం – కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్  సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 13:  రాష్ట్రంలో మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం…

18న మేడారంలో కేబినెట్‌ ‌భేటీ ?

-1 9న మేడారం పనులకు సీఎం ప్రారంభోత్సవాలు – అదే రోజు రాత్రికి దావోస్ ‌ప్ర‌యాణం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 13: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాజధాని వెలుపల కేబినెట్‌ ‌భేటీ జరపాలని  నిర్ణయించడం ఇటీవలి కాలంలో ఇదే…

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తుది ఓట‌ర్ల‌ జాబితా ప్రకటన

– మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు – 26,80,014 మంది మహిళా ఓటర్లదే అగ్రస్థానం – నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 13:  రాష్ట్రంలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది…