Category తెలంగాణ

జర్నలిస్ట్‌ దత్తురెడ్డి కుటుంబానికి అండ

ఆర్‌అండ్‌బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి పిట్లం (కామారెడ్డి), ప్రజాతంత్ర, జులై 7: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెర్వు గ్రామానికి చెందిన సీనియర్‌ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి (37) ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆయన స్వగ్రామమైన మద్దెలచెర్వుకు వచ్చిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ…

మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం

– రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి – మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచన చేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ…

ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జ్ ల నియామ‌కం

– పేర్లు ప్రకటించిన పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై7: సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నియమించారు. సోమవారం జిల్లా ఇంఛార్జ్‌లతో జూమ్‌ ‌టింగ్‌ ‌నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ‌నాక్షి నటరాజన్‌, ‌టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ ‌కుమార్‌…

విధాన నిర్ణయాలు రైతులకు మేలు చేయాలి

వ్యవసాయ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: ఆయిల్‌ పామ్‌ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులను కలిసే యోచనలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగుదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ…

క్రీడాకారులకు రైలు చార్జీల్లో రాయితీ

కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్‌ దిల్లీ, ప్రజాతంత్ర, జులై 7: జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ చార్జీల్లో రాయితీ కల్పించాలని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  దిల్లీలో భేటీ అయ్యారు. ఖేలో ఇండియా…

ఎస్‌హెచ్‌జీ సభ్యుల ప్రమాద బీమా పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యల ప్రమాద బీమా పథకాన్ని 2029వరకు పొడిగిస్తూ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ జీవో జారీ చేశారు. స్త్రీ నిధి ద్వారా బీమా అమలు కొనసాగించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అమల్లోకి వచ్చిన ఈ…

హాస్పిటళ్లకు అధునాతన పరికరాలు కొనాలి

అధికారులకు మంత్రి  దామోదర దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ హాస్పిటళ్లకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు కొనుగోలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో వినియోగిస్తున్న యంత్రాలు, పరికరాలు ఏంటో అక్కడి వైద్యులను అడిగి తెలుసుకోవాలంటూ కొత్త టిమ్స్‌ హాస్పిటల్స్‌, వరంగల్‌ సూపర్‌…

ఇది రైతులు సాధించిన విజయం

విత్తన రైతులకు పరిహారం పంపిణిలో మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జులై 7: మల్టీనేషనల్‌ కంపెనీలతో పోరాడి విత్తన రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చూశామని, ఐదారు నెలలుగా ఈ సమస్యపై రైతులు పోరాటం చేశారని, చాలా కష్టపడి పనిచేసిన కలెక్టర్‌ దివాకర్‌ను అభినందిస్తున్నానని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాబివృద్ధి శాఖల మంత్రి ధనసరి…

అక్బరుద్దీన్‌ కాలేజీని తక్షణమే కూల్చండి

ఆయనకో న్యాయం.. పేదలకు మరో న్యాయమా అని సర్కారుకు ప్రశ్న మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్‌ దాడులను సహించం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు అల్టిమేటం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 7: అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్‌ కాలేజీ భవనాన్ని తక్షణమే కూల్చివేస్తారా లేదా?.. లేకుంటే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వానికి…