Category తెలంగాణ

Attendance : హాజరు నిబంధనల్లో కోర్టుల జోక్యం లేదు

–  హైకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌ ఆగస్టు 6: హాజరు శాతం(attendance percentage)  నిబంధనల విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు (High court) తేల్చి చెప్పింది. యూనివర్సిటీ నిబంధనలను కోర్టులు తిరిగి రాయలేవని స్పష్టం చేసింది. పరీక్షలు రాయడానికి అవసరమైన హాజరు శాతం నిర్ణయాన్ని యూనివర్సిటీలు రూపొందిస్తాయని, ఇంజనీరింగ్‌ కోర్సు సాంకేతిక వ్యవహార అంశమని పేర్కొంది.…

Yadagirigutta : యాదగిరిగుట్టలో ముగిసిన పవిత్రోత్సవాలు

– భక్తులకు పవిత్ర మాలలు అందజేసిన అర్చకులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో(Lakshmi Narasimhaswamy Temple)  సోమవారం ప్రారంభమైన పవిత్రోత్సవాలు బుధవారం ముగిసాయి. స్వయంభూ పంచ-నారసింహ స్వామి క్షేత్రంలో స్వామి ప్రధాన ఆలయంలో అత్యంత వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా…

Jayashankar, Gaddar : జయశంకర్‌, గద్దర్‌లకు సీఎం నివాళులు

– కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు దిల్లీ, ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ (Prof. Jayashankar) జయంతి, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ (Gaddar) వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth) దిల్లీలోని తన అధికారిక నివాసంలో నివాళులర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు,…

Jayashankar : మహోన్నత వ్యక్తి జయశంకర్‌

– శాసనమండలి చైర్మన్‌ గుత్తా నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ జాతిపిత ప్రొపెసర్‌ జయశంకర్‌ (Jayashankar) జయంతి సందర్భంగా శాసన సభ ప్రాంగణంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి (Legislative council chairman Gutta Sukhender Reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…

Dr.Namrata : డాక్టర్‌ నమ్రత బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్‌

– ‘సృష్టి’ కేసులో ఇప్పటివరకు 17మంది అరెస్ట్‌ హైదరాబాద్‌, ఆగస్టు 6 : గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్‌ (Srushti fertility hospital) కేసులో తాజాగా ఆరుగురిని అరెస్టు చేయగా ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు ముఖ్యంగా మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నారు.…

kamareddy declaration : కామారెడ్డి డిక్లరేషన్‌ కాదు.. ముస్లిం డిక్లరేషన్‌

– బీసీలపై కాంగ్రెది కపట ప్రేమ – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దిల్లీ, ఆగస్టు 6: యాభయ్యేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎన్నడైనా బీసీలను పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా.. సీఎంను చేసిన లెక్కలు ఉన్నాయా.. ఉంటే చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీని నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్‌ ధర్నా చేస్తోందంటూ…

jayashankar: జయశంకర్‌ సార్‌ సేవలను వెలకట్టలేం

– ప్రత్యేక రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికారు – మాజీ మంత్రి హరీష్‌రావు నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 6: జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడు జయశంకర్‌ సార్‌ అని మాజీ మంత్రి హరీష్‌రావు కొనియాడారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన కృషి ఎప్పటికీ వెలకట్టలేమని పేర్కొన్నారు. నాలుగున్నర…

రైల్వే లాండ్రీ టెండర్‌లో బిడ్‌ తిరస్కరణపై పిటిషన్‌

ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : రైల్వే లాండ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 434 కోట్ల విలువైన టెండర్‌లో ఒక బిడ్డర్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ చర్యపై విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. భారత రైల్వేలతో బూట్‌ మోడల్‌లో వాణిజ్య లాండ్రీ సేవలను పిటిషనర్‌ సంస్థ అందిస్తోంది. 2025…

హైదరాబాద్‌లో వర్షం

– బంజారాహిల్స్‌, కూకట్‌పల్లిలో కుంగిన రోడ్లు – కుంగిన ప్రదేశంలో దిగబడిన వాటర్‌ ట్యాంకర్‌ – కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ జాం, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మియాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మదీనాగూడ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో…