Category తెలంగాణ

ఔటర్‌పై వాహనం ఢీకొని ముగ్గరు కార్మికుల మృతి

దరాబాద్‌,ఆగస్ట్‌11(ఆర్‌ఎన్‌ఎ): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్‌పై పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులు ఒడిశాకు చెందిన నారాయ(28), చెక్‌మోహన్‌(24), జైరామ్‌(32)గా గుర్తించారు. గాజువాక నుంచి సెల్‌ఫోన్‌…

‌హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

-ప‌లు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన‌ – అప్రమత్త‌మైన‌ సహాయక బృందాలు –  వ‌చ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు -వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్11: ‌హైదరాబాద్‌ ‌నగరంలో సోమ‌వారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నల్లని మేఘాలు ఆవరించింది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌పంజాగుట్ట, అర్‌పేట్‌, ఎస్ఆర్‌నగర్‌,…

15,16లలో మాంసం దుకాణాలు ఎందుకు బంద్‌ చేయాలి

-వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : స్వాతంత్య్ర దినోత్సవం(15వ తేదీ), శ్రీకృష్ణ జన్మాష్టమి(16వ తేదీ) సందర్భంగా మాంసం దుకాణాలు, పశు కబేళాలను మూసివేయాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆవిధమైన అధికారం జీహెచ్‌ఎంసీకి లేదని, ఎందుకు మాంసం…

డిమాండ్ మేర‌కు నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా

– గ్రీన్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తికి భారీ ప్ర‌ణాళిక‌లు – భ‌విష్య‌త్ త‌రాల‌కు మేలుచేసే చ‌ర్య‌లు -ప్ర‌భుత్వ కార్యాలయాల్లో సౌర‌విద్యుత్ ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు – ఉపముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ మొయినాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 11:  విద్యుత్తు డిమాండ్ ఎంత ఉన్నా నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  రంగారెడ్డి జిల్లా…

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: రానున్న గణేష్‌ ఉత్సవాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ కోరారు. ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 6వ…

మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడి

హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: ‌హనుమకొండలోని రామ్‌నగర్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. వెంటనే 8 నెలల పెండింగ్‌ ‌బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడే…

నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు

– ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో భట్టి విక్రమార్క హావిూ ఇచ్చారని, ఇది వాస్తవమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే ఆ హావిూని అధిష్ఠానం అమలు చేయలేదని వాపోయారు. ఈ విషయంలో తనను రాష్ట్రంలోని ముఖ్య నేతలే అడ్డుకుంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే…

సిఎం రేవంత్‌ రెడ్డికి ఊరట

~ ఎన్నికల కేసును కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 11: సిఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. 2019 అక్డోబర్‌లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని నమోదైన ఈ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌…

రైతులకు రూ.లక్ష కోట్లు అందజేశాం

– పులుసుబంత ప్రాజెక్టు ప్రారంభిస్తాం – రైతులకు అందుబాటులో సహకార బ్యాంకులు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మణుగూరు, ప్రజాతంత్ర, ఆగస్టు 11: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వివిధ రూపాలలో రూ.లక్ష కోట్లు సబ్సిడీ రూపంలో అందజేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…