Take a fresh look at your lifestyle.

కల్లంలోని కష్టాలు కడతేరేదెప్పుడు…

  • సమయానికి తీసుకెళ్ళని వరి ధాన్యం లోడ్‌
  • ‌తాలు పేరుతో తరుగు తీస్తున్న వైనం
  • వానొస్తే అంతే సంగతులని వాపోతున్న రైతులు
  • క్షేత్ర స్థాయిలో నెరవేరలేకపోతున్న సర్కారు హామీలు
గోదావరిఖని  : ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతలు అష్ట కష్టాలనెదుర్కొటున్నారు. చేతికంది వచ్చిన వరిధాన్యం అమ్ముకోవడానికి రైతులు తీవ్ర అవస్థలను అనుభవిస్తున్న వైనం వరి కల్లంలో చోటు చేసుకుంటుంది. రాష్ట్ర సర్కారు వరి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులు కల్పించినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసినా క్షేత్ర స్థాయిలో రైతులు మోసపోవడంతో పాటు ఇబ్బందులకు గురవుతున్నా రు. అధికారుల ఉదాసీనత, రైస్‌ ‌మిల్లర్ల దోపిడీకి అన్నదాత అశ్రితపర్వమవుతున్నారు. పంట చేతికచ్చిన తరువాత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతు వాటిని అమ్ముకునేందుకు వచ్చిన సంధర్భంలో తూకం వేసే సమ యంలో ప్రతి 40 కిలోల వరి బస్తాకు 2 కిలోలు తరుగు పేరుతో కోత విధించడం చేయడంతో పాటు తూకం వేసి రైస్‌ ‌మిల్లర్లకు తరలించినా సకాలంలో వారు అన్‌లోడ్‌ ‌చేసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తేమశాతం ఎక్కువగా ఉందని ఇబ్బందు లకు గురి చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే తేమ శాతం, తాలు పేరుతో తరుగు తీసినా మళ్ళీ మూడు, నాలుగు రోజులు రైస్‌ ‌మిల్లర్లు జాప్యం చేస్తూ మరలా బరువు తగ్గేలా చేసి అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రైతు కూలీలతో వరి కోయడం లాంటివి చేసే సమయంలో తాలు, మట్టి పెళ్ళలు,రాళ్ళు వచ్చే అవకాశాలుండేవని ప్రస్తుతం హార్వెస్టర్‌ ‌లాంటి యంత్రాలతో వరి కోత పనులు చేపట్టి ధాన్యం సేకరించడంతో తాలు, మట్టి పెళ్ళలు వచ్చే అవకాశాలు లేకున్నా మిల్లర్లు తప్పుడు విధానాలతో మోసం చేసి నష్టం వచ్చేలా చేస్తున్నారని ఆరోపించారు. వర్షం వస్తే గుండెలు ఆగిపోయే పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నా వారికి సకాలంలో టార్పాలిన్లు అందేలా చేయడంలో వ్యవసాయ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కనీసం అద్దెకు టార్పాలిన్లు తీసుకుందామనకు న్నా కరోనా లాక్‌డౌన్‌ ‌సమయంలో దొరకని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని రైతుల కష్టాలు తీర్చేలా చేయాలని రైతులు కోరుతున్నా
తాలు పేరుతో లోడ్‌కు 5 క్వింటాళ్ళు తరుగు తీస్తున్నరు : తోట సత్తయ్య, రైతు
image.png

తాలు ఒక లోడ్‌కు 5 క్వింటాలు కోత, కల్లం మీదకి వచ్చినంక రైతులను ఇబ్బందులు పట్టద్దని ప్రభుత్వం చెబుతున్నా వీరు మారడం, లేదు. గతంలో కూలీలతో వరిధాన్యం తీసుకుంటు, ఇప్పుడు హార్వెస్టర్లతో చేస్తే తాలు వచేచ అవకాశం లేదు.
సమయానికి ధాన్యం అన్‌లోడ్‌ ‌చేయడం లేదు : చింతపూవు తిరుపతి, రైతు

image.png

సమయానికి ధాన్యం అన్‌లోడ్‌ ‌చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగానే మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ధాన్యం బరువు తగ్గేలా చేస్తున్నారు. తేమ 17 వరకు ఉన్నా తీసుకోవచ్చనే ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ 12 శాతం తేమ వచ్చినా కాంటా పెట్టుకోవడం లేదు.  రైతు కష్టాలను తీర్చేలా అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి.
ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలిస్తున్నాం : సహకార శాఖ అసిస్టెంట్‌ ‌రిజిస్ట్రార్‌  

image.png

‌రైతులను ఇబ్బందులు పెట్టకుండా ఇప్పటికే ఆదేశాలిచ్చాం. తాలు పట్టే యంత్రాలను సమకూర్చి వాటిద్వారా వందశాతం తాలుకోత కటింగ్‌ ‌లేకుండా చేస్తున్నాం. రైతులకు అందుబాటులో  గోలివాడ, ఆకెనపల్లి, సోమనపల్లి మిల్లులకు ధాన్యం తీసుకునేలా చేశాం.

Leave a Reply