Category తెలంగాణ

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలి

` రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు – బీజేపీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కమిటీ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు సమావేశానికి అధ్యక్షత వహించారు.…

ఇకపై తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: లోయర్‌ ట్యాంక్‌ బండ్‌- సెక్రటేరియట్‌ను కలిపే తెలుగు తల్లి ఫ్లైఓవర్‌కు పేరు మార్పు జరిగింది.  ఇకపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ అనే పేరు ఇవ్వాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఆ పేరుకు ఆమోదం తెలిపింది,

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – ‘ఆత్మ’ చైర్మన్‌ సుంకవెల్లి, 24 సభ్యుల ప్రమాణ స్వీకారం – ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, – 19 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ దమ్మపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన…

ఆర్టీసీలో ఏఐ వినియోగం

– మరింత వేగంగా సేవలకు నిర్ణయం – ఏఐ వినియోగం కోసం ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు – ఆర్టీసీ యాజమాన్యానికి మంత్రి పొన్నం అభినందన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 24: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు ఆర్‌టిసి మరో గొప్ప అడుగు వేసింది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌(ఏఐ)ను విస్తృతంగా వినియోగించాలని…

శిక్షణలతో మహిళా ప్రాంగణాలు కళకళ

– కోటిమందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు – ప్రతీ మహిళ మహిళా సంఘాల్లో చేరాలి – ఎరువుల సరఫరా బాధ్యత మహిళా సంఘాలకే – పోషణ మాసం, బతుకమ్మ వేడుకల్లో మంత్రులు ప్రభాకర్‌, సీతక్క కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎం కాలనీలోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా, శిశు వికాస కేంద్రం…

అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ఇవ్వాలి

– మంత్రి సీతక్కకు యూనియన్‌ ప్రతినిధుల విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ప్రకటించాలని ఐఎన్‌టియుసి అనుబంధ తెలంగాణ స్టేట్‌ ఇందిరా ప్రియదర్శిని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంత్రిని కలిసి…

గ్రూప్‌-1పై హైకోర్టు ఆదేశాలు వారికి చెంపపెట్టు

– కాంగ్రెస్‌ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. గాంధీ భవన్‌లో పార్టీ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్‌ చైర్మన్‌ సామా రామ్మోహన్‌ రెడ్డి బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న వాళ్లకి…

బెట్టింగ్‌ ‌యాప్‌ల కేసు

– ఈడీ విచారణకు హాజరైన సోనూసూద్‌ ‌న్యూదిల్లీ,సెప్టెంబర్‌24: ‌బాలీవుడ్‌ ‌నటుడు సోనూ సూద్‌ ‌బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌  ‌విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్‌ ‌యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో విచారణకు రావాలని ఈడీ గతంలో సోనూ సూద్‌కి సమన్లు జారీ చేసింది. అయితే కొన్నిరోజులుగా పంజాబ్‌లోనే ఉండి వరద బాధితులకు అండగా నిలిచిన సోనూ తాజాగా…

ఇండ్ల లబ్ధిదారులకు రూ.1618 కోట్లు చెల్లింపు

– జోరుగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు – ప్రస్తుత వారంలోనే రూ.188 కోట్లు విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరు 24 : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1612.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ వి.పి.గౌతం తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో…