Category తెలంగాణ

మొదటికొచ్చిన డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా వ్యవహారం

– రీ వెరిఫికేషన్‌లోనూ గందరగోళమే – స్పోర్ట్స్‌ అథారిటీ అధికారుల తీరుపై మొదట్నుంచీ అనుమానాలు అధికారులతో సమావేశంలో మంత్రి ఆగ్రహం! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోటా టీచర్ల నియామకాలు చేపట్టిన…

జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతగోపీనాథ్‌

– ఎంపిక చేసిన అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపీనాథ్‌ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్‌ నేతగా, జూబ్లీహిల్స్‌…

స్థానిక ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం

– నేతలను అలర్ట్ ‌చేసిన వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌- ముఖ్యుల‌తో కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావుల టెలి కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌25: ‌స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో బిఆర్‌ఎస్‌ అ‌ప్రమత్తం అయ్యింది. పార్టీ శ్రేణులను,కార్యకర్తలను అలర్ట్ ‌చేసింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌…

స్మితాసభ‌ర్వాల్‌కు హైకోర్టులో ఊరట

– ఘోష్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,సెప్టెంబర్‌ 25: ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఘోష్‌ కమిషన్‌ నివేదికపై పలువురు ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కారు. ఈనేపథ్యంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితాసబర్వాల్‌ హైకోర్టును ఆశ్రయించగా ఘోష్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.…

అంగన్‌వాడి కేంద్రాలకు దసరా సెలవులు

– రేపటినుంచి 8 రోజులపాటు సెలవులు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు మంజూరు చేసింది. ఐఎన్టీయూసీ అనుబంధ ఇందిరా ప్రియదర్శిని…

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి హరీష్ రావు.

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి  జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి పాదాల వద్ద మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బూడిద బిక్షమయ్య ప్రత్యేక…

వృద్ధుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించండి

– రిటైర్డ్‌ డీఎస్పీ దామెర నర్సయ్య వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లకు సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విద్యారణ్యపురి పక్షాన వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం నియమావళి-2011 అనుసరించి గురువారం శిక్షణ నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు రిటైర్డ్‌ డీఎస్పీ దామెర నర్సయ్య అధ్యక్షత వహించారు.…

కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతాం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ -‘శాతవాహన’లో హాస్టల్‌ భవనాలకు మంత్రులు పొన్నం, అడ్లూరి శంకుస్థాపన కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25: ఆర్థిక ఇబ్బందులున్నా అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని, రాబోయే కాలంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా పనిచేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు.…

కిట్స్‌ డబ్ల్యులో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే  

వరంగల్‌, ప్రజాతంత్ర, సెస్టెంబర్‌ 25: జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రారంభమై 51 సంవత్సరాలు అయిన సందర్భంగా కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, వరంగల్‌ (కిట్స్‌డబ్ల్యు)లోని స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ డేను వలంటీర్లు ఘనంగా జరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా యువజన అధికారి సిహెచ్‌.అన్వేష్‌ మాట్లాడుతూ వివిధ…