Category తెలంగాణ

యువ‌త‌కు మీ విజ‌యం స్ఫూర్తి.! సివిల్స్ విజేత‌ల‌ను శాలువా క‌ప్పి సత్కారించిన మంత్రి హరీశ్ రావు

యూపీఎస్సీ -2021లో విజేత‌లుగా నిలిచిన అభ్య‌ర్థులు జి సుధీర్ రెడ్డి (69), స్నేహ (136), చైత‌న్య రెడ్డి (161), రంజిత్ కుమార్ (574), స్మ‌ర‌ణ రాజ్ (676) స‌హా, సివిల్స్ స‌బ్జెక్ నిపుణురాలు, మెంటర్‌ బాల‌ల‌త  బుధ‌వారం కోకాపేట‌లోని నివాసంలో  కలిసారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారిని శాలువా క‌ప్పి సన్మానించారు. అనంతరం వారితో కలిసి…

లక్నవరం చెరువులో పడి ఇద్దరు మృతి

హైదారబాద్‌ ఐఎస్‌బి విద్యార్థులుగా గుర్తింపు ములుగు, ప్రజాతంత్ర, మే 31 : జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. లక్నవరం చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కాగా, వారిద్దరూ హైదరాబాద్‌లోని ఇండియన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ‌బిజినెస్‌ ఐఎస్‌బికి చెందినవారుగా గుర్తించారు. ఐఎస్‌బీకి చెందిన నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు…

రాష్ట్ర అవతరణ వేడుకల ఫుల్‌ ‌డ్రెస్‌ ‌రిహార్సల్‌: ‌పరిశీలించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌

‌పరిశీలించిన సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌హైదరాబాద్‌, ‌మే 31 : కోవిడ్‌ ‌కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రేపు జూన్‌ 2‌వ తేది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్‌ ‌రిహార్సల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌…

నీళ్లు, నిధులు, నియామకాల్లో.. టిఆర్‌ఎస్‌ ‌పూర్తిగా విఫలం

తెలంగాణ కోసం మరో పోరాటం అవసరం టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌మెదక్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్‌ ‌పార్టీ అధ్యక్షులు కోదందరామ్‌ ‌విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం…

అభివృది పనుల కోసం పుస్తెలు అమ్ముకుంటున్నారు

సర్పంచలకు తాళిని అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన సిఎం సర్పంచ్‌ ‌శాంతమ్మ వ్యాఖ్యలపై రేవంత్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : అభివృద్ధి పనుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు కట్టేందుకు పుస్తెల తాడును అమ్ముకోవాల్సి వొచ్చిందంటూ సర్పంచ్‌ ‌శాంతమ్మ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విటర్‌ ‌వేదికగా స్పందించారు.…

జూన్‌-‌సెప్టెంబర్‌ ‌మధ్య వర్షపాతం అంచనా కంటే ఎక్కువే

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో అంచనాల్లో సవరణ ఐఎండి వెల్లడి రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వార్షాలు: వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : ఈసారి జూన్‌-‌సెప్టెంబర్‌ ‌నెలల మధ్య సగటు వర్షపాతం భారత వాతావరణ శాఖ అంచనా కంటే 3 శాతం వరకు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండి…

మోడీ రాకతో అభివృద్ధి పరుగులు తీస్తుంది కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన కింద 10కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం హర్షణీయమని తెలిపారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ను తెలంగాణకు కేసీఆర్‌ ‌రానివ్వట్లేదని విమర్శించారు. ‘చేపల, పాల ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నం…

‌గ్రామ సర్పంచ్‌లకు అండగా బిజెపి

వారి కోసం త్వరలో రాష్ట్ర శాఖ మౌనదీక్ష నిధులు ఇవ్వకుండా గ్రామాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని, న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే…

మంత్రి హరీష్‌రావు చొరవతో రూ.25లక్షలతో.. మహాత్మా…. మహాద్బుతం…

అహింసా మూర్తికి… ఆత్మీయతతో… సిద్ధిపేటలో మహాత్ముని విగ్రహం మహా వైభవం ఆవిష్కరించనున్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సూడా ఆధ్వర్యంలో 25లక్షల రూపాయలతో సిద్ధిపేటలో గాంధీ జంక్షన్‌ ‌సుందరీకరణలో భాగంగా అభివృద్ధి జరిగింది. ఇటీవల గాంధీ అసోసియేషన్‌…