Category ఎడిటోరియల్

సామాజిక న్యాయాన్ని బ‌లోపేతం చేసే నిర్ణ‌యం

Caste census

కుల‌గ‌ణ‌ ( Caste census) ను చేప‌ట్టాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం నిజంగా ఎంతో ధైర్యంగా తీసుకున్నది. గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ఈవిధంగా నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ముందుకు రాలేదు. ఇందుకు కార‌ణం వాటి నిర్ల‌క్ష్య‌మే. నిజం చెప్పాలంటే మోదీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో సామాజిక న్యాయం జ‌రుగుతుంది. ఎవ‌రెన్ని శుష్క వాగ్దానాలు చేసినా సామాజిక న్యాయం కోసం…

నెల గడిచింది  …?

Terror attack in Pahalgam

పహల్గాం లో  ఉగ్రదాడి జరిగి ఒక నెల గడిచిపోయింది .. 22 ఏప్రిల్‌న పహల్గామ్ లో  ఉగ్రవాదులు దాడి చేసారు.. ఆ దాడిలో  26 మంది మృతి చెందారు .   నలుగురు  అత్యంత క్రూరమైన ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోకి ప్రవేశించారు.. 26 మంది పర్యాటకులను  హత్య చేసి పారిపోయారు. వారు సరిహద్దు దాటి 200 కిలోమీటర్ల లోపలికి…

అంతర్గత భద్రత

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని కోరిన పిటిషనర్లను ఉద్దేశించి దేశ రక్షణ దళాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి అభ్యర్థనలూ చేయవొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు, ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ..పిల్ మే 2న విచారించేటప్పుడు వెలువడ్డాయి. ఈ…

వరుస భేటీలు ..!

బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) వరుసగా రెండు రోజుల నుండి ఆపార్టీ సీనియర్‌ ‌నాయకుడు సిద్దిపేట శాసనసభ్యుడు,మాజీ మంత్రి  తన్నీరు హరీష్‌రావు ఇంటికి వెళ్ళడం తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రధానంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆధిపత్యంపైన రాష్ట్రంలో విస్తృత చర్చజరుగుతున్న నేపథ్యంలో  వీరి భేటీ ఆసక్తిని కలిగిస్తున్నది. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో…

దేశ భక్తి

ప్రదర్శనాత్మక దేశభక్తి అనేది ఎక్కువగా దేశభక్తిని బాహ్యంగా ప్రదర్శించడంలో కేంద్రీకృతమై ఉంటుంది. మరోవైపు, బాధ్యతాయుత దేశభక్తి అనేది దేశ పాలనాభివృద్ధికి సహాయపడే చర్యలపై దృష్టి పెడుతుంది. ఏ కారణమో కానీ, భిన్నాభిప్రాయం తెలపడమన్నది అతి ఉన్నతమైన దేశభక్తి రూపమని  కొన్ని తర్కబద్ధమైన గొంతులు పేర్కొంటాయి. అంటే, దేశభక్తి అనేది జాతీయ గీతం పఠించడం, జెండా ఎగరేయడం…

అమాయకులు ..!

“పది సంవత్సరాల క్రితం అమాయకులందరూ నరేంద్ర మోదీ అనుచరులయ్యారు.. ఇప్పుడు మోదీ అనుచరులందరూ అమాయకులయ్యారు…” ఈ అభిప్రాయం హిందీ భాషలో కాస్త మొరటుగా ఉంది..విస్తృత ప్రచారంలో ఉన్నది..వృత్తి ప్రమాణాలు భాష పట్ల నియంత్రణను సూచిస్తాయి కాబట్టి గత 11 సంవత్సరాలుగా ప్రధాన మంత్రి హోదాలో దేశ ప్రజలను గుమ్రాహ్ చేస్తున్న తీరును సరళమైన భాషలో చెప్పే…

కాల్పుల విరమణ ..?

ఇరుదేశాల సరిహద్దుల్లో ఒకవైపు భీకరదాడులు జరుపుతూనే శాంతివచనాలు పలుకుతున్నది పాకిస్తాన్‌. ‌దీనికి అమెరికా, రష్యాతోసహా వివిధ దేశాల మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నది. అయితే ఈ వార్త రాసేప్పటికి రెండు దేశాలు చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన వార్తలు రావడం విశేషం.  ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుతాయి తప్ప…

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్

పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే అందుకు ప్రతీకార చర్య తీసుకుంటామన్నట్లుగానే వారం రోజుల వ్యవధిలో   దేశ ప్రధాని నరేంద్ర మోదీ   అన్నమాట నిలుపుకున్నారు. అందుకు మంగళవారం అర్థరాత్రి ముహుర్తాన్ని నిశ్చయించి విజయవంతంగా లక్ష్యాన్ని ముద్దాడారు. దీనితో యావత్‌ భారతదేశం హర్షం వ్యక్తంచేస్తున్నది. ప్రధానంగా సైన్యం తీసుకున్న చర్యలకు జయజయ నినాదాలు చేస్తున్నారు. అయితే అంతటితోనే సంతృప్తి…

పొరుగు దేశాలు

“ప్రతి యుద్ధం ప్రారంభం చీకటి గది తలుపు తెరిచినట్లుగా ఉంటుంది. చీకటిలో ఏం దాగి ఉందో ఎవరికీ తెలియదు..” -హిట్లర్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ..ముష్కరులకు శిక్షణా ..ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ప్రపంచం ముందు ఈ రోజు నగ్నంగా నిలబడ్డది. టర్కీ మినహా ఏ దేశం కూడా పాకిస్థాన్ కు అండగా నిలబడే అవకాశం కనిపించడం లేదు.…