రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయం గత కొద్ది నెలలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వొస్తున్నది. కొత్త సంవత్సరం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారమని, ఉగాదని ఇలా ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వొస్తున్నారు. ఆఖరికి ఏప్రిల్ మూడవ తేదీని ఖరారు చేశారు. కాని ఆ తేదీ కూడా దాటిపో యింది. ఇప్పుడు మరో వారం రోజుల్లో ప్రకటన వెలువడవొచ్చనుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం మంచికన్నా చెడు అయ్యే అవకాశాలుంటాయన్న భ యం కాంగ్రెస్ నాయకత్వానికి ఉన్నట్లు కనిపిస్తున్నది. మంత్రి పదవులు ఆశిస్తున్న అనేకులు తమకే స్థానం కల్పిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. తాము అశించినట్లు క్యాబినెట్‌లో సీటు లభించని పక్షంలో వారు కినుక వహించే అవకాశం ఉంటుంది.
అది త్వరలో రానున్న స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపించకపోదు. అందుకు మరికొంత కాలం మంత్రివర్గ విస్తరణ వాయిదా వేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతున్నట్లు వినికిడి. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ అన్నది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాల్‌గా మారింది. మంత్రులను ఎంపిక చేసుకోవడంలో నిన్నమొన్నటి వరకు సీనియార్టీ, ఆర్హత, నిబద్ధత గురించి మాట్లాడు కున్నారు. కాని, ఇటీవల కాలంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో వొచ్చిన మార్పులు పార్టీ అధినేతలను మరింత చిక్కుల్లో పడేసింది. వివిధ సామాజిక వర్గాలు, కులాల డిమాండ్లు మొదలైనాయి. తమ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రి పదవి లభ్యం కాలేదని కొందరు, జనాభా ప్రాతిపదికన మరో మంత్రి పదవి కట్టబె ట్టాలని మరికొందరు అధిష్టానానికి వ్యక్తిగతంగా, లే ఖల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ సామాజిక వర్గాన్ని తీసి పక్కకు పెట్టే పరిస్థితి లేదు. అలా అని అందరికి న్యాయంచేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఫలితంగా పార్టీలో నిబద్దతగా పనిచేస్తున్న కొందరిపట్ల అన్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్తగా మరో ఆరుగురుని మంత్రివర్గంలో తీసుకునే అవకాశముంది. ఈ ఆరు గురిని ఎంపిక చేసుకునే విషయంలో అధిష్టానం చాలా కాలంగా కుస్తీ పడుతున్నది. ఎందుకంటే అధిష్టానం వద్ద ఆశావహులకు సంబంధించి పెద్ద జాబితానే ఉంది. వీరిలో చాలా మంది సీనియర్లుండడంతో అధిష్టానం అంత తొందరగా తేల్చుకోలేక పోతున్నది. దానికి తగినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బిసీ ఎమ్మెల్యేల నుండి వొస్తున్న ఒత్తిడి కూడా తోడైంది. ఇప్పటివరకు మంత్రుల ప్రాతినిధ్యంలేని జిల్లాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఒకటుంది.
ఇదిలా ఉంటే చాలాకాలంగా పార్టీ జండాను మోస్తూ, ఒకటికి నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగాఎంపికైన తమను విస్మరిస్తే ఎలా అంటూ మరికొందరు సరాసరి అధిష్టానాన్ని కలిసి విన్నవించుకుంటున్నారు. దీంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నది. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర నేతలతో దిల్లీ నేతలు అనేక దఫాలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆఖరి సారిగా గత నెల 24న అధిష్టానంతో జరిగిన భేటీతో ఈ ఎపిసోడ్‌కు తెరపడుతుందనుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పిసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు, ముఖ్యనేత కెసి వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నట రాజన్‌లు విస్తృతస్థాయిలో చర్చించారు. అప్పుడే మంత్రుల జాబితా ఫైనల్ అయిందన్న వార్తలు వొచ్చాయి. వారి చర్చల్లో నలుగురి పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. ముందుగా నలుగురిని మంత్రు లుగా తీసుకున్నట్లు అయితే, ఆ పైన వొచ్చే ఒత్తిడితో మరో ఒకరిద్దరికి అవకాశం కల్పించవొచ్చని అధి ష్టానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. తాజాగా సిద్దమైన నలుగురి జాబితాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొద• •నుండి మొగ్గు చూపిస్తున్నట్లు తెలు స్తున్న సుదర్శ న్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి, జి. వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు విని పించాయి. ఈనెల మూడు లేదా నాలుగో తేదీన ఈ పేర్లను ప్రకటించే అవకా శాలున్నట్లు కూడా వార్తలు వొచ్చాయి.
కానీ, ఆ తేదీ కూడా దాటిపోయింది. మరో వారమో, రెండు వారాలో సమయం తీసుకునే అవకాశ ముందటున్నారు. ఇదిలాఉంటే పార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి లేఖ మరో సంచ లనంగా మారింది. ముందుగా అనుకున్నట్లు ఏప్రిల్ మూడవతేదీన కొత్త మంత్రులను ప్రకటించకుండా ప్రతిష్టంభనకు గురిచేసింది కూడా ఈ లేఖే అన్న వాదన కూడా లేకపోలేదు. ప్రకటించబోయే మంత్రుల జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత కల్పించాలంటూ ఆయా జిల్లాల శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖను జానారెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజే యటంతో అధిష్టానం తిరిగి ఆలోచనలో పడినట్లు తెలుస్తున్నది.
అదేవిధంగా మూడుసార్లుగా ఎన్ని కవుతూ వొస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పిం చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతోకాలంగా పార్టీని అంటిపెట్టుకున్న తమనుకాదని, కొత్తగా పార్టీలో చేరినవారికి అవకాశం ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తు న్నారు. ఇలా మంత్రిపదవులు ఆశిస్తున్నవారిలో గతంలో హామీ ఇచ్చిన మేరకు ప్రొఫెసర్ కోదండ రామ్, ఆది శ్రీనివాస్, విజయశాంతి, అద్దంకి దయాకర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మైనార్టీ ఎంఎల్సీ అమర్ అలీఖాన్ తదితరలున్నారు. కాగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఫిరోజ్‌ఖాన్ లాంటి కొందరిని ఎమ్మెల్సీ లుగా తీసుకుని మంత్రి వర్గంలో తీసుకునే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తు న్నది.