– 22ఏ పేరుతో నిందలు వేయాలనుకున్నారు
– మేము అన్నీ బయటపెడుతున్నాం
– వీటిపై చర్చ జరగకూడదనే గందరగోళం చేశారు
– శాసన సభలో బీఆర్‌ఎస్‌పై సీఎం తీవ్ర విమర్శలు
– మేము అన్నీ బయటపెడుతున్నాం
– వీటిపై చర్చ జరగకూడదనే గందరగోళం చేశారు
– శాసన సభలో బీఆర్‌ఎస్‌పై సీఎం తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ధరణిని అడ్డం పెట్టుకుని భూదాన భూములను పట్టా చేసుకున్నారు అని బీఆర్‌ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. శాసనసభలో బుధవారం ఆయన భూముల అక్రమ పట్టాలు, అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు జరిగిన సంఘటనలపై మాట్లాడారు. గత ప్రభుత్వంలో అటవీ భూముల నుండి 106 ఎకరాల భూమి గండ్రకు అప్పగించారని, ఈ విషయంలో కలెక్టర్‌ను సుప్రీంకోర్టు తిట్టిందని చెప్పారు. సిరిసిల్లలో ఎనిమిది వేల అసైన్డ్ భూములు బదలాయించారన్నారు. సందీప్ ఝాను కలెక్టర్‌గా వేస్తే రెండు వేల ఎకరాలు బయటకు తీశారన్నారు. మైహోమ్ రామేశ్వర రావుకు ఎయిర్‌పోర్టుకు అనుకుని 2647 ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ము ఇలా కొల్లగొడతారా అని ప్రశ్నించారు. కాప్రాలో అవేక్యు ప్రాపర్టీ అని నమస్తే తెలంగాణలో రాయించారని, తర్వాత ధరణి తెచ్చి మేల్లచెరువులో భూదాన్ భూములు లాక్కుందని, మైహోమ్ 113 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీకి వాడుకుంటున్నారని చెప్పారు. అసైన్డ్ భూములు.. వక్ఫ్ భూములు అన్నీ మై హోమ్ వాళ్ళు లాక్కోవచ్చా అని ప్రశ్నించారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల లెక్క వాలిపోయారు.. లక్ష కోట్ల భూములు లాక్కున్నారు.. ఈ చర్చ రాకుండా ఉండాలనే సభలో గందరగోళం చేయాలని చూశారని సీఎం బీఆర్‌ఎస్ సభ్యులపై విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలను అడ్డంపెట్టుకుని అడ్డుకోవాలి అనుకున్నారు.. శిశుపాలునికి కూడా వంద తప్పులు చేస్తేనే శిక్ష పడింది.. ఎవరికి అయినా సమయం వస్తుంది.. అప్పుడే శిక్ష పడుతుంది అన్నారు. 22ఎను అడ్డంపెట్టుకుని తమపై నిందలు వేయాలని చూశారు.. తాము అన్నీ బయటపెడుతున్నామన్నారు. సంగారెడ్డిలో భూముల చిట్టా కూడా బయటపెడతా అన్నారు. ఇలాంటి వాళ్లను మనం క్షమిస్తే మనల్ని భవిష్యత్ తరాలు క్షమించవు అని సీఎం అన్నారు. వీటన్నింటిపై సిట్ విచారణకు సిఫార్సు చేస్తున్నానన్నారు. సామాన్య ప్రజల సమస్య పరిష్కారం అయ్యేలా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
చరిత్ర కొంతమందిని ఎప్పుడూ క్షమించదు
గతంలో తప్పిదాలపై చర్చ జరిగితేనే భవిష్యత్తులో పొరపాట్లు సరిదిద్దుకోవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. కానీ ప్రతిపక్షం గతంలో జరిగిన తప్పులను చర్చించకూడదని సభ నుంచి బయటకు వెళ్లిందన్నారు. విద్యుత్ కొరత రావాలి అని కొందరు క్షుద్ర పూజలు చేశారు
ఇది కూడా సభలో చర్చకు వస్తుంది అని భయపడ్డారు.. తమ ప్రభుత్వానికి ప్రతీ ఆడబిడ్డ సమానమే.. సామాన్య మహిళలు అయినా గౌరవంగా చూసుకుంటాం.. కొంతమంది ప్రతిపక్ష నాయకులు వికృత చేష్టలతో వ్యవహరించారు అని అన్నారు. స్పీకర్‌గా ఒకరిని ఆమోదం పొందిన తరవాత అందరికీ సమాన హక్కులు కాపాడే పని చేస్తారని, అలాంటి చైర్‌ను కాపాడుకోవడానికి గత ప్రభుత్వం కమిటీ వేసి రూల్స్ రాసుకున్నారని తెలిపారు. శాసనసభ నిర్వహించడానికి ప్రొసీజర్ సిద్ధం చేసింది గత ప్రభుత్వమేనన్నారు. నినాదాలతో ఉన్న డ్రెస్ వేసుకుని రావద్దని సభ ఆమోదం చేసింది హరీష్ మంత్రిగా ఉన్నప్పుడేనన్నారు. పోలీసు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు.. స్పీకర్ ఆదేశాలు అమలు చేస్తారు.. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా నల్ల చొక్కాతో వచ్చారు కదా అంటున్నారు.. నినాదాలతో కూడిన టి షర్ట్ వేసుకుని రావద్దు అని స్పీకర్ ఆదేశిస్తే అనుమతించరు.. పార్లమెంటు నిబంధనలు అక్కడ.. అసెంబ్లీలో నిబంధనలు ఇక్కడ అమలు చేస్తారు అని సీఎం స్పష్టం చేశారు. పోడియం లోపలికి వస్తే సభ్యుడు సస్పెండ్ అయినట్టే అని వారు చట్టం చేశారు.. కానీ మీరు గౌరవంగా క్షమించారు.. సభలో మైక్ ఇచ్చారు.. సభలో సభ్యులను, సభ బయట స్పీకర్‌ను దూషించారు.. సభలోకి వచ్చాకా మార్పు వచ్చి ఉంటుందేమో అని మైక్ ఇచ్చారు.. అప్పుడు కూడా అలాగే చేశారు.. అందుకే మీరు సస్పెండ్ చేశారు అని స్పీకర్‌నుద్దేశించి సీఎం అన్నారు.

——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు