– బావాబామ్మర్దుల తీరుపై మండిపడ్డ అద్దంకి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బీఆర్‌ఎస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్లలాగా దోచుకున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అంద్దంకి దయాకర్ విమర్శించారు. వారు ఇంత దిగజారి మాట్లాడతారా అని నిలదీశారు. బావాబామ్మర్దుల నస భరించాల్సిన దుస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండె. వెన్నుముక ఎవరికీ లేకుండెనంటూ ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎక్కువ మాట్లాడే దరిద్రులను హెచ్చరిస్తున్నామన్నారు. ఆటో కార్మికులు చనిపోయిన రోజు బీఆర్‌ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మంత్రివర్గాన్ని కించపరిచిన వారిపై తాము కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పారిపోయిన హరీశ్ ఇప్పుడు అడ్లూరిని చూసి పారిపోయారని అద్దంకి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ నేతలు అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటూ ఆరోపించారు. సొంత మనిషి కవిత.. తనకి అన్యాయం జరిగిందని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అప్పడు బీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపించడం తెలంగాణను దోచుకోవడానికి బీఆర్‌ఎస్ పార్టీకి లైసెన్స్ ఇచ్చినట్టయిందని అద్దంకి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇక క్రియాశీల రాజకీయాలకు వస్తాడో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





