హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. రూ.5 వేల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో గురువారం మధ్యాహ్నం హాజరుపరిచిన సంగతి తెలిసిందే.
పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీనివాస్‌ను మూడు సార్లు విచారణకు పిలిచామని, విచారణకు రాకపోవడంతోనే గురువారం ఉదయం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, క్రాంతి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మాసబ్‌ట్యాంక్ పోలీసు స్టేషన్‌లోనే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను కలిసి పరామర్శించారు. శ్రీనివాస్‌ను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.