•రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : కుల గణనఫై మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్, బిజెపిలకు లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మంగళవారం మీడియా స మావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మా ట్లాడుతూ.. భారత్ జూడో యాత్రలో రాహు ల్ గాంధీ ఎప్పుడో స్పష్టం చేశారని, ఎవరి లెక్క ఏంటో తేలాలని చెప్పారని అన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి రెండూ దొందూ దొందేనని అన్నారు. బిజెపి కులగణనను వ్యతిరేకిస్తూ అఫిడపిట్ దాఖలు చేసిందని, మొన్నటి సర్వే లో పాల్గొనని వారు కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు కు ఫామ్ లు పంపుతున్నామన్నారు.
మేము ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కుల గణన సర్వే చేశాం. మీ వివరాలు ఇప్పుడ్కెనా ఇవ్వండి…అప్పుడే మీకు మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత హక్కు లేదని స్పష్టం చేశా రు. బిజెపికి చేతన్కెతే దేశవ్యాప్త సర్వే చేయ డానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోవాలని సవాల్ విసిరారు. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ పా ర్టీ బిసిలకున్యాయం చేసేలా కృషి చేస్తుందని, మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో స మావేశం నిర్వహిస్తామని, ప్రజల్ని తప్పుదారి పట్టించే యత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బిసిలలో ముస్లి మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తది కాదని, అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ కిందకు నెట్టవద్దన్నారు. ఎర్ర చొక్కా వెసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదని, ప్రగతిశీల భావాలు కలిగిన తాను మొన్నటి నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడిరచారు.





