గాంధీ హాస్పిటల్‌కి రోడ్డు ప్రమాద మృతుల మృతదేహాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలను రెండు అంబులెన్సుల్లో జబల్‌పుర్‌ ‌నుంచి సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పోలీసులు, డీఎంహెచ్‌వో, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మల్లారెడ్డి, సంతోష్‌, ‌శశికాంత్‌, ‌రవి, రాజు మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌కి నాచారం నుంచి వచ్చిన వారి కుటుంబసభ్యులకు అప్పగించగా.. బ్యాంక్‌ ‌మేనేజర్‌ ‌టీవీ ప్రసాద్‌ ‌మృతదేహాన్ని తార్నాకలోని గోకుల్‌నగర్‌లో ఉండే ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *