– రాష్ట్ర అధ్యక్షుడికి త్రీమెన్ కమిటీ నివేదిక అందజేత
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది. ఈ కమిటీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రత్యేకంగా చర్చలు జరిపింది. కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత, అడ్వొకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా రామచందర్ రావు ముఖ్య నాయకులతో సమావేశమై అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, సమీకృత ప్రక్రియ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడంపై పార్టీ దృష్టి పెట్టింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





