యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం నిత్య పూజలతోపాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు ఆస్థాన పరంగా పూజించిన తదుపరి సాయంత్రంవేళ ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఊంజల్ సేవ నిర్వహించారు. ముత్యాల పల్లకిపై అలంకృత అయిన అమ్మవారికి పూజారులు హారతి ఇచ్చారు. ఆస్థాన విద్వాంసులు మేళతాళాలతో సంకీర్తనలు పాడి అమ్మవారికి నివేదన సమర్పించారు. అద్దాల మండపంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని అర్చకులు ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





