prajatantra_news

prajatantra_news

కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు

– ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్‌ 5: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఏం చేస్తుందో చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్లలో ఏం చెప్పారో ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయిందని, కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మే పర్ణిస్థితి లేదని అన్నారు. జూబ్లీహిల్స్‌…

కార్తీక పౌర్ణమి.. శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

– నదీ తీరాల్లో పుణ్యస్నానాలు – ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో బుధవారం కిటకిటలాడాయి. శివ నామస్మరణలతో ఆలయాలు మారుమోగాయి. పుణ్య నదులలో స్నానాలాచరించి స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఆలయాల్లో దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు చేశారు. వరంగల్‌ వేయిస్తంభాల…

ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

– పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పభుత్వం కేటాయించిన సచివాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల…

టీ-హబ్‌తో స్టార్టప్‌ రాజధానిగా ఎదిగిన హైదరాబాద్‌

– ఐటీ మంత్రిగా అత్యంత గర్వించదగిన క్షణాలలో ఇది ఒకటి – మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా తాను చేసిన ఇష్టమైన కార్యక్రమాల్లో టీ-హబ్‌ ఏర్పాటు ఒకటి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన కేటీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను…

నవీన్‌ విజయం కోసం కృషి చేస్తాం

– సీఎంను కలిసిన క్రైస్తవ సంఘాలు, పాస్టర్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి జూబ్లీహిల్స్‌ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం కలిశారు. నవీన్‌ యాదవ్‌ విజయం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను…

మూసాపేటలో డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం

– పండ్ల వ్యాపారులతో మాట్లాడి సమస్యలపై ఆరా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా మూసాపేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. ప్రజలతో…

ఆందోళన కలిగిస్తున్న వరుస ప్రమాదాలు

– పలు కుటుంబాల్లో తీరని విషాదాలు -హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4:  ‌ప్రైవేట్‌ ‌ట్రావెల్స్ ‌బస్సులు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. గత వారం కర్నూలు జిల్లాలో వేమురి కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్ ‌బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. నల్లగొండ జిల్లా వేములపల్లి…

రేగా బెదరింపులకు భయపడేది లేదు

– వంద కోట్ల బేరంతో దొరికిన అసలు తెలంగాణ ద్రోహి – పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విమర్శలు భద్రాద్రి కొత్తగూడెం,ప్రజాతంత్ర,నవంబర్‌ 4:  ‌మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న ఉడత ఊపులకు, తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్‌ ‌నాయకులు గానీ కార్యకర్తలు కానీ భయపడే పరిస్థితులు లేవని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ…

ఎదురెదురుగా ఢీకొన్న ప్యాసింజర్‌ , గూడ్స్ ‌రైలు

– ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పుర్‌లో ఘటన  రాయపూర్‌,‌ నవంబర్‌ 4: ‌ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. మంగళవారం బిలాస్‌పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లాల్‌ఖదాన్‌ ‌ప్రాంతంలో మెము ప్యాసింజర్‌-‌గూడ్స్ ‌రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

mlc prof kodandaram

– సంస్కరణలపై అధ్యయానికి కమిటీ ఏర్పాటు – కమిటీలో ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌లకు చోటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌విధానంలో మార్పులకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో చాలా అవతకవకలతో పాటు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం…