Prajatantra News 1

Prajatantra News 1

అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలి

‌న్యూదిల్లీ, నవంబర్‌ 21: ‌లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్‌ ‌ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జ్కెరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వొచ్చిందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మోదీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ ‌చేసి విచారిస్తే విషయాలన్నీ బయట పడతాయని అన్నారు. ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమె పైనా విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్‌ ‌గాంధీ కోరారు. ‘అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు’ అని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు.

సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలి కాంగ్రెస్‌ అ‌గ్రనేత నేత రాహుల్‌ ‌గాంధీ  డిమాండ్‌ ‌న్యూదిల్లీ, నవంబర్‌ 21: ‌లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్‌ ‌ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సెబీ చీఫ్‌ ‌మాధభి…

29‌న రాష్ట్రవ్యాప్తంగా దీక్షాదివస్‌

‌తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం ఇది• బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌21:  ‌తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్‌ ‌నిలుస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ…

ఏరోస్పేస్‌ ‌భారీ విస్తరణతో 1200 కొత్త ఉద్యోగాలు

ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు రఘువంశీ ఏరోస్పేస్‌ ‌భారీ విస్తరణ పనులకు శంకుస్థాపన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌విమాన ఇంజన్ల కీలక విడి భాగాలు, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్‌ ‌భారీ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. గురువారం శంషాబాద్‌ ఏరోస్పేస్‌ ‌పార్క్ ‌లో…

మూసీ ప్రక్షాళన చేయకుంటే నా జన్మ దండగ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని.. ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే బాధ్యతను కాంగ్రెస్‌ ‌ప్రభత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి.. నదులను కబళిస్తే.. మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రజా ఆరోగ్యం పటిష్ఠ ఆర్ధికం పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి. కానీ, శాపంగా మిగిలిపోకూడదు. మూసీ ప్రక్షాళన చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పం. ఈ తరానికే కాదు.. తరతరాలకు మేలు చేసే నిర్ణయం. ఈ నిర్ణయానికి అండగా నిలవాలి‘ అని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో సీఎం రేవంత్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. కాగా.. మూసీ పరీవాహక ప్రాంతం మురికి కూపంగా మారి.. హైదరాబాదీలకు విష వాయువులు అందిస్తుందని, దుర్భరంగా మారిన వారి జీవన విధానం మార్చేందుకు మూసీని ప్రక్షాళన చేసి, పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మూసీ వెంట నరకం అనుభవిస్తోన్న పేదవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతాం.. రాబోయే రోజుల్లో యాదవులకు అత్యధికంగా సీట్లు ఇస్తామని, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు పెంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్‌ ‌పార్టీ తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదిలావుంటే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చస్తారని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతామని ప్రకటించారు. మూసీ కాలుష్యం వల్ల ఆ నది పరీవాహక ప్రాంత ప్రజలు అణుబాంబుతో కలిగే ప్రమాదం కంటే ఎక్కువ దుష్పరిణామాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వరంగా ఉండాల్సిన మూసీ.. శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవంతోనే వారికి ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగా, సబర్మతి నదులను రూ.40 వేల కోట్లతో సుందరీకరణ చేసుకుంటే, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా మూసీ పునరుజ్జీవం చేయొద్దా? అని ప్రశ్నించారు. ప్రధాని చేసిన పనిని మెచ్చుకుంటూ.. మూసీ ప్రక్షాళనపై నకిలీ బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టానని బీఆర్‌ఎస్‌ అం‌టోందని, ఈ మూసీ ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని భావోద్వేగానికి లోనయ్యారు. ‘రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేపట్టి.. రూ.25 వేల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. ఎన్ని శక్తులు అడ్డుపడినా పూర్తి చేస్తాం హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకువెళతాం : ఎక్స్ ‌వేదికగా స్పష్టం చేసిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌21: ‌మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని..  ఎన్ని శక్తులు అడ్డుపడినా ప్రక్రియ పూర్తి చేసే…

విధుల్లో చేరిన 8 వేల 47 మంది కానిస్టేబుల్స్‌… టెస్ట్ ‌క్రికెట్‌ ‌మాదిరిగానే  పోలీస్‌ ఉద్యోగం

పోలీసులు మద్యానికి దూరంగా ఉండండి లంచాలకు మరిగితే అంతే సంగతులు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలి పోలీసులకు కీలక సూచనలు చేసిన కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ‌పోలీసులు మద్యానికి దూరంగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్‌  ‌విజ్ఞప్తి చేశారు. యువ పోలీసులు ఫిజికల్‌ ‌ఫిట్‌నెస్‌గా ఉండాలని.. ఏ వ్యసనానికి కూడా…

గాంధీ భవన్‌ ‌కు చేరుకున్న పటాన్‌ ‌చెరు కాంగ్రెస్‌ ‌పంచాయితీ

సీఐల పోస్టింగులపై భగ్గుమన్న కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌కాట శ్రీనివాస్‌ ‌గౌడ్‌ కాంగ్రెస్‌ ‌వ్యతిరేకులకు పదవులు ఇవ్వడంపై గాంధీ భవన్‌ ‌లో పిసిసి అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ఫిర్యాదు పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్‌ 21:‌పటాన్‌ ‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ‌నాయకుల పంచాయితీ గాంధీభవన్‌ ‌కు చేరుకుంది. ఎంపీ…

టెలివిజన్

దేవుడు ఎక్కడో ఉండి విశ్వమంత వీక్షించినట్లు శ్రీకృష్ణుడు విశ్వ దర్శనం చేయించినట్లు మనిషి కలగని చూసి సంభాషించినట్లు మనిషి మాయ లాంతరు మంత్రదండం అంజనం అన్నట్లు చూపుతుంది టెలివిజన్ ఉన్నది ఉన్నట్లు ప్రత్యక్ష పరోక్ష దూర దృశ్య శ్రవణ దర్శిని చెంతనే దర్శింపజేయు దూరదర్శిని సంస్కృతి సంప్రదాయాల వాడుక ఆధునిక ప్రజాభిప్రాయ వేదిక ఆకాశవాణికి తోబుట్టువులు…

ముసాఫిర్

గాయం సూదిమొనై అస్తిత్వాన్ని గుచ్చి నొప్పిని మొద్దుబారుస్తుంది బరువెక్కిన గుండె ఖాళీ చెయ్యమనీ తూట్లు పొడవబడిన మెదడుతో మొరపెట్టుకొని ఇంకిపోతుంది ఎక్కడో పాతిబెట్టబడ్డ ధైర్యం రెక్కలు- ఆశకు అపనమ్మకానికి అంటుకడతాయి భయం- కన్నీళ్ళు తుడుచుకొని జీవితాన్ని మరోసారి అసంబద్ధతకు తాకట్టుపెడుతుంది మొత్తానికి మనిషి నైరాశ్యపు కాళ్ళపై లేచేసరికి ఇంకో ద్రోహపు ఫలితాల నిరీక్షణలో తోయబడి బ్రతుకు…

కడలి-మనిషి

నీలిరంగు సముద్రం నేల అందాలను చూడాలనుకుంది పుట్టుకనుండి ఇప్పటి దాక పోరు చేస్తునే ఉంది మనిషి ఆకలి అంతును చూడాలను కున్నట్లు కడలి అలలు లేచి లేచి పడి పరుగెడు తున్నాయి చెలియల కట్ట దాటాలని మనిషి హృదయం మనసు తీరని కోరికల కై తపిస్తున్నట్లు ఉదధి తనలోని బడబానలం దాచుకుని తనకు తాను శీతలంగా…

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది. కాకతీయులు , కుతుబ్ షాహీలు మరియు అసఫ్ జాహీ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం భారత ఉపఖండంలో అగ్రశ్రేణి సంస్కృతికి కేంద్రంగా ఉద్భవించింది. పాక, కళలు మరియు సంస్కృతి పట్ల పాలకుల ప్రోత్సాహం మరియు ఆసక్తి తెలంగాణను బహుళ-సాంస్కృతిక ప్రాంతంగా మార్చింది, ఇక్కడ రెండు…