NEWS

NEWS

పాక్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు

కరాచీ, డిసెంబర్‌ 26 : ‌పాకిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. గత రెండు రోజుల్లో బలోచిస్తాన్‌ ‌రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తెహ్రీక్‌ ఇ ‌తాలిబన్‌ ‌పాకిస్తాన్‌ (‌టిటిపి) బృందం చేసిన దాడుల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ‌సైన్యం డియా విభాగం ఆదివారం ప్రకటించారు. జోభో జిల్లాలోని…

శ్రీ‌శైలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు శ్రీశైలం, డిసెంబర్‌ 26 : ‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిపాడ్‌ ‌వద్ద రాష్ట్రపతికి ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని…

జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌

‌భోపాల్‌, ‌డిసెంబర్‌ 26 : ‌జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌ ‌గోల్డ్ ‌మెడల్‌ ‌గెలిచింది. మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌ ‌వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో 50కేజీల విభాగంలో నిఖత్‌ ‌స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌ ‌మ్యాచ్‌లో   రైల్వేస్‌కు చెందిన అనామికపై 4-1 స్కోరు తేడాతో…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో కీలక మలుపు

కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు సిట్‌ ‌విచారణ నిలిపివేత..రికార్డులు సిబిఐకి అప్పగించాలని ఆదేశం చంచల్‌గూడ జైలులో నందకుమార్‌పై ఇడి విచారణ హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 26(ఆర్‌ఎన్‌ఎ) : ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కేసీఆర్‌ ‌సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ…

”అజాత శత్రువు అటల్ జీ”

 డిసెంబర్ 25… వాజ్ పేయి జయంతి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్ పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని…

విద్యా ప్రదర్శనం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అస్త్రవిద్యా ప్రదర్శనంగావించిన తర్వాత గదా, ఖడ్గ విద్యల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో సహజ కవచకుండలాలతో సూర్యకాంతితో ప్రకాశిస్తూ విశాలనేత్రుడై మత్తేభంలా నడుచుకుంటూ వచ్చాడు. దుర్యోధనాదులు కర్ణుని వెంటనిలిచారు. కర్ణుడు అర్జునుడు  చేసిన విన్యాసాలన్నింటినీ చేసి  •చూపించాడు. దుర్యోధనుడు అమితానందం పొందాడు. కర్ణుని గాఢాలింగం చేసుకుని తనతో స్నేహంగా…

అనర్ఘ రత్నాలు మన “భారతరత్న” లు.

ఏసుక్రీస్తు జన్మదినాన డిసెంబరు 25న జన్మించిన మరో ఇరువురు మహానుభావులను స్మరించుకుందాం. వారే.. మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహరి వాజ్ పేయీ!!  ఒకే తేదీన జన్మించిన ఆ ఇరువురికీ 2014 లో ఒకే సారి భారతరత్న పురస్కారాలు లభించడం దేశానికే గర్వకారణం.  మాననీయుల్లో మహనీయుడు  మదన్ మోహన్ మాలవ్య గొప్ప విద్యావేత్త, కర్మయోగి అయిన …

ఆధ్యాత్మికత – ప్రేమానంద

లింగోద్భవం, శూన్యం నుంచి విభూతి, కుంకుమ సృష్టించడం వంటి వీధి గారడీవాళ్లు ప్రదర్శించే కనికట్టు విద్యలను ప్రదర్శించి చూపి వాటిని ఆధ్యాత్మిక శక్తులుగా చలామణీ చేయడం దగాతో, మోసంతో సమానమని అందువల్ల అతను నేరస్తుడని న్యాయమూర్తి అన్నారు. అతనికి సహచరులుగా ఉండిన ము­గ్గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. ప్రేమానంద కేసులో జిల్లా సెషన్స్‌…

శ్రీ‌కృష్ణ జన్మస్థానంపై పిటిషన్‌

లక్నో, డిసెంబర్‌ 24 : ఉత్తరప్రదేశ్‌ ‌లోని మధురలో ఉన్న షాహీ ఈద్గా మసీదును సర్వే చేయాలంటూ స్థానిక కోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి 2 తర్వాత సర్వేను చేపట్టి..  జనవరి 20లోగా నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. హిందూ సేన అనే సంస్థకు చెందిన విష్ణు గుప్తా వేసిన న్యాయ వ్యాజాన్ని విచారించిన కోర్టు ఈమేరకు ఆదేశాలు…

భారతీయ గురుకుల విద్య ప్రపంచానికి ఆదర్శం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 24 : ‌భారత గురుకుల విద్యా సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2014 తర్వాత వైద్య కాలేజీల సంఖ్య 65శాతానికి పైగా పెరిగిందన్నారు. కొత్త జాతీయ విద్యావిధానం ద్వారా.. మెరుగైన విద్య అందుతుందని చెప్పారు. శ్రీ స్వామినారాయణ గురుకుల్‌ ‌రాజ్‌ ‌కోట్‌ ‌సంస్థాన్‌ 75‌వ అమృత్‌ ‌మహోత్సవంలో..…