NEWS

NEWS

రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు  తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763…

ఇక దేశమంతా రాహుల్‌ ‌గొంతుక వినిపిస్తుంది

ప్రజలు ప్రశ్నిస్తుంటారు కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 25 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్‌ ‌వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం…జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియాతో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…

‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్‌(అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫార్మస్)అనే ఎన్‌.‌జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా…

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం   తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక…

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ‘కంటి వెలుగు’

ఇప్పటి వరకు 41 రోజుల్లో 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు 14 లక్షల 69 వేల 533 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్‌, ‌మార్చి, 25 : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…

‌రాహుల్‌ అనర్హత విపక్షాలను ఐక్యం చేస్తున్నదా ..!

రాహుల్‌పై చట్టపరమైన చర్యగా చూపిస్తున్నప్పటికీ, ఇది కాంగ్రెస్‌పై బిజెపి కక్షసాధింపన్న విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. చెంపదెబ్బకు ఉరిశిక్ష విధించినట్లుగా, చిన్న విషయానికి రాహుల్‌కు పెద్ద శిక్ష పడేట్లుగా తెరవెనుక బిజెపి ప్రమేయాన్ని ఆ పక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలవేళ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను దెబ్బతీయటంలో  భాగంగానే  రాహుల్‌ను బలిపశువును చేశారని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. మోదీ…

రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం సాధించాయని అనుకోవచ్చు. ఒక చిన్న కేసులో అతనిని దోషిగా నిర్ధారించడం ద్వారా 56 అంగుళాల…

ద్రౌపది వివాహం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి తన పురోహితుని పంపి వారిని వచ్చి శాస్త్ర విధిగా వివాహమాడమన్నాడు. పాండవులు రాగానే ద్రుపదుడు వారి కుల గోత్రాలనడిగాడు. ధర్మరాజు అసలు విషయం చెప్పి రాజ మర్యాద ననుసరించి వివాహం జరిపించమన్నాడు. ద్రుపదుడు అయిదుగురూ వివాహమాడటం శాస్త్ర సమ్మతమా అనడిగాడు. ఆ సమయంలోనే వేద వ్యాసుడు విచ్చేసి ద్రౌపది…

సంచలనం లేపుతున్న రాహుల్‌ అనర్హత

కాంగ్రెస్‌ అ‌గ్రనేత, పార్లమెంట్‌ ‌సభ్యుడు రాహుల్‌గాంధీపై అటు న్యాయస్థానం, ఇటు పార్లమెంట్‌ ‌సెక్రెటరేట్‌ ‌తీసుకున్న నిర్ణయాలిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్నాయి. రాహుల్‌పైన  రాజకీయ కక్షతో చేపట్టిన చర్యగానే పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎదుటి పార్టీ పైన అనేక ఆరోపణలు చేయడం పరిపాటె..! ఆ సందర్భంలో అనుకోని రీతిలో వారి…