NEWS

NEWS

అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికీ ‘ప్రజాతంత్ర’ తెలంగాణ పక్షమే

(మహేందర్‌ కూన, జర్నలిస్ట్‌) ‘‘వెయ్యి తుపాకి గుండ్లకన్నా శత్రుత్వం వహించిన నాలుగు పత్రికలు భయంకరమైనవి’’ అన్నారు  ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ బోనా పార్టె. సైనికాధికారి నుండి  సామ్రాజ్యాధినేతగా ఎదిగి  నియంత పాలన సాగించిన నెపోలియన్‌ పత్రికా స్వేచ్చపై ఉక్కు పాదం మోపాడు. ఆయనను ధిక్కరించి ఎదురు నిలిచిన పత్రికలతో వేగలేక అన్న మాటలవి. కరుడు కట్టిన…

గవర్నర్‌కు సిఎం, మంత్రుల నూతన సంవత్సర శుభాకాంక్షలు

సిఎంకు శుభాకాంక్షల వెల్లువ హైదాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళిసైకి  సీఎం రేవంత్‌ రెడ్డి న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పారు. రాజ్‌ భవన్‌లో నిర్వహించిన ఓపెన్‌ హౌస్‌  కార్యక్రమానికి హాజరైన రేవంత్‌ గవర్నర్‌ దంపుతలకు పుష్ఫగుచ్చం ఇచ్చి విషెస్‌ చెప్పారు. సీఎంగా రేవంత్‌ రాజ్‌ భవన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

పటాన్‌చెరులో డివైడర్‌ను ఢీకోన్న స్కూటీ…ఇద్దరు విద్యార్థుల మృతి సూర్యాపేటలో లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి  జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్‌చెరు పట్టణం…

ఇస్రో మరో శిఖరం చేరింది

‘పీఎస్‌ఎల్‌వీ-సీ58’ విజయవంతంపై సిఎం రేవంత్‌ రెడ్డి హర్షం శాస్త్రవేత్తలకు అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి…

పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

న్యూ ఇయర్‌లో ఇస్రో మరో ఘనత…శుభారంభం ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతుందన్న ఇస్రో ఛైర్మన్‌ శ్రీహరికోట, జనవరి 1 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల అంటే బ్లాక్‌హోల్‌ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న…

మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదు

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం యువతకు శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నా దగ్గర చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు… 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను, ఫార్మా…

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదుక సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో,జనవరి1 :  నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ విూడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో వరుసగా బలమైన…

తెలంగాణలో మద్యం అమ్మకాల్లో రికార్డు

హైదరాబాద్‌,జనవరి1 : పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్‌ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. ఆదివారం ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్‌, లక్ష 35 వేల కేసుల బీర్‌…

నగరంలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌,జనవరి1: రాజధాని హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోగా, మరోవైపు యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు…

కొత్త సంవత్సరంతో ఆలయాల్లో రద్దీ

యాదాద్రి తదితర ఆలయాలకు పోటెత్తిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళసై హైదరాబాద్‌,జనవరి1 : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్‌, బాసరతోపాటు హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్‌, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం సహా పలు క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి శ్రీ…