సెప్టెంబర్ 17 విలీనం కాదు, విద్రోహమే..
వీర తెలంగాణ విప్లవోద్యమం పీడిత ప్రజానీకం సృష్టించిన ప్రజా ఉద్యమం. ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగిన పోరాటం ప్రపంచ ప్రజలను ఆనాడు ఆశ్చర్యపరిచింది. కనీవినీ ఎరుగని రీతిలో రాచరిక పాలనపై, భూస్వామ్య పీడనలపై ప్రజా వెల్లువను, పీడితుల ఆకాంక్షలను ఆ ప్రజా ఉద్యమం వెల్లడించింది. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ‘‘ దొర బాంచాన్…
