బోడుప్పల్‌లో భూపోరాటానికి దిగిన కవిత

– అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 2: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను బోడుప్పల్‌లో పోలీసులు అరెస్ట్ ‌చేశారు. గురువారం ఉప్పల్‌ ‌నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో భూ పోరాటానికి టీఆర్‌ఎస్‌ ‌సిద్ధమైంది. ఇందులో భాగంగా బోడుప్పల్‌ ‌చేరుకుని భూ పోరాటం చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటు చేసుకోవడంతో కవితతో పాటు టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉప్పల్‌లో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని కవిత అన్నారు. బొల్లారం పీఎస్‌ ‌వద్ద టీఆర్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మాట్లాడుతూ.. మహిళలు, తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ ‌చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హాలను మాత్రమే అడిగాం తప్ప వేరే డిమాండ్లు ఏ అడగలేదన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి నేటి నుంచి కౌంట్‌డౌన్‌ ‌స్టార్ట్ అయ్యిందన్నారు. ఉద్యమకారులకు వాళ్లు ఇస్తామన్న 250 గజాల స్థలం ఇవ్వాలని మాత్రమే అడిగామని తెలిపారు. కచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తామన్న హాలు అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అడిగితే ఉద్యమకారులపై లాఠీఛార్జ్ ‌చేసి రక్తం చిందేలా కొట్టడం అన్యాయమన్నారు. ఉద్యమకారులకు హామీలను ఈ ప్రభుత్వానికి రోజూ గుర్తు చేస్తూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *