– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: రాంపల్లి రామాలయం ముందు హనుమాన్ విగ్రహం ధ్వంసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి రామాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇది కేవలం విగ్రహంపై దాడి కాదని, హిందువులపై దాడి అని పేర్కొన్నారు. గతంలో ముత్యాలమ్మ, గణేష్, నవగ్రహ, భూలక్ష్మి, మాతాజీ ఆలయాలపై జరిగిన అనేక దాడులను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల ఆరాధ్య దేవుడు, ధైర్యాన్ని ప్రసాదించే ఆంజనేయ స్వామి విగ్రహంపై దాడి ప్రతి హిందువుపై దాడిగా పరిగణిస్తున్నామన్నారు. గతంలో జరిగిన ఘటనలకు సంబంధించిన కేసులలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





