– తెలంగాణ వ్యతిరేకి పవన్ కళ్యాణ్
- కాంగ్రెస్‌కు వోటేస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి పొన్నం
హుస్నాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5 : మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పొత్తుపెట్టుకుని బీజేపీ తెలంగాణపై విషం చిమ్మడాన్ని ప్రజలెవ్వరూ సహించరని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణను వ్యతిరేకించే విధానాలకు బీజేపీ పాల్పడుతుందని విమర్శించారు. ఒక వైపు తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరారు. మరోవైపు తెలంగాణ కండ్లు పడి ఆంధ్రా కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేస్తామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా, వివక్షపూరితంగా మాట్లాడే వ్యక్తులతో పొత్తులు పెట్టుకుని వస్తున్న బీజేపీ ఆలోచనను తెలంగాణ మేధావులు,ప్రజలు ఆలోచించాలని కోరారు. హుస్నాబాద్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యమన్నారు. అలాగే గత పదేళ్లలో బిఆర్‌ఎస్ చేసింది సున్నా అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.