‘నీట్’ రీ ఎగ్జామ్‌తో అప్రమత్తం

– టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం ఆంక్షలు

న్యూఢిల్లీ, జూన్ 16 : నీట్ 2026 రీ`ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం సెక్షన్ 69ం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈనెల 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై నియంత్రణ ఉండనుంది. ఈనెల 21న దేశవ్యాప్తంగా నీట్-2026 రీ`ఎగ్జామ్ నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్ష భద్రతను దృష్టిలో ఉంచుకుని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే టెలిగ్రామ్‌లో ఈనెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేయాలని ఎలక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష పూర్తయిన తర్వాత పాత టైమ్ స్టాంప్‌లతో నకిలీ ’పేపర్ లీక’ ఆధారాలు సృష్టిస్తున్న ముఠాలను అడ్డుకోవడానికే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ పేరుతో విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ టెలిగ్రామ్ ఛానళ్లపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగాలు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌లో ఎనిమిది టెలిగ్రామ్ ఛానళ్లను నడుపుతూ రూ.1.5 కోట్ల మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సైబర్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. రీ`ఎగ్జామ్‌కు ముందు ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ విÖడియాలో జరుగుతున్న ప్రచారాలపై ఎన్‌టీఏ స్పందించింది. అవన్నీ తప్ప్పుడు ప్రచారాలేనని స్పష్టం చేస్తూ విద్యార్థులు అధికారిక సమాచారం కోసం వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది. ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *