– ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్లు
– పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి రూ.3,15,614 కోట్లు
– కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్
న్యూదిల్లీ, జూలై 31 :కేంద్ర కేబినెట్ రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం రూ.4,50,988 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే తలసరి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ మొదటి స్థానంలో ఉందని మంత్రి అన్నారు. ఈ పథకం కింద డ్యామ్‌లు, సరస్సులపై ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి 5000 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశిరచుకున్నామని అన్నారు. రాబోయే ఐదేళ్లల్లో సోలార్ ప్యాసెల్ విద్యుత్ ఉత్పత్తిని 7 రెట్లు పెంచుతామని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 3,15,614 కోట్ల రూపాయలు కేటాయించి నట్టు మంత్రి తెలిపారు. 2026-2030 మధ్య కాలానికి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు తెలిపారు. ఇక సముద్ర మంథన్ పథకానికి 84,084 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. 2030-31 వరకూ ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. సముద్రం అడుగున దాగున్న ముడిచమురు, సహజవాయువు వనరుల గుర్తింపు కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఖేలో ఇండియా పథకానికి సంబంధించి కేంద్రం రాబోయే ఐదేళ్ల కాలానికి రూ.29,054 కోట్లు కేటాయించిందని కూడా మంత్రి తెలిపారు. యూనీ డైరెక్షనల్ ట్విన్ ట్యూబ్ టన్నుల్స్ నిర్మాణానికి రూ.9,779 కోట్లు కేటాయించామని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




