– పూర్తిస్థాయి యుద్ధం చేస్తున్నామన్న ఇరాన్
టెహ్రాన్, జూలై 21: అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశం ప్రస్తుతం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తోందని ప్రకటించారు. ప్రస్తుతం కేవలం సైనిక పరంగానే కాకుండా ఆర్థిక రంగంలో కూడా తీవ్ర పోరాటం కొనసాగుతోందని, ప్రజల జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వానికి అత్యంత కీలక బాధ్యతగా మారిందని ఆయన పేర్కొన్నారు. దేశం యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజల దైనందిన జీవితం దెబ్బతినకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెజెష్కియన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడడం ప్రస్తుతం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడులు చేస్తోందని, ఆ పరిణామాలను దేశ ప్రజలు అంగీకరించాలని కోరారు. టీవల కొద్ది రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై కూడా ప్రభావం పడుతోంది. అయితే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, ఉద్రిక్తతలను తగ్గించేందుకు పలు దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఇరు దేశాలు తమ తమ వైఖరిని మార్చుకోకపోవడంతో పరిస్థితి ఇంకా అనిశ్చితంగానే ఉంది.
-ప్రపంచంలోని అమెరికాను పౌరులు అప్రమత్తంగా ఉండాలి
వాషింగ్టన్ :పశ్చిమాసి
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





