ఝార్ఖండ్‌ ‌వోటర్ల జాబితాలో ఆఫ్ఘన్ జాతీయులు

– దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి

జంషెడ్‌పూర్‌, ‌సెప్టెంబర్‌ 9: ‌ఝార్ఖండ్‌లో నిర్వహించిన వోటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ‌ప్రక్రియలో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. జమ్‌షెడ్‌పూర్‌ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వోటర్ల ముసాయిదా జాబితాలో ఏకంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్‌ ‌పౌరుల పేర్లు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ముసాయిదా వోటర్ల జాబితా పరిశీలన, పత్రాల ధృవీకరణ సమయంలో అధికారులు ఈ వ్యత్యాసాన్ని కనిపెట్టారు. నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు సరైన భారతీయ పౌరసత్వ పత్రాలను సమర్పించలేకపోయారు. అనంతరం నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద ఆఫ్ఘనిస్థాన్‌ ‌పాస్‌పోర్టులు లభించడంతో వారు విదేశీయులని నిర్ధారణ అయింది. ఝార్ఖండ్‌ ‌సీఈవో కేజీ రవికుమార్‌ ఈ అం‌శాన్ని ధ్రువీకరిస్తూ విదేశీ పౌరుల పేర్లను వోటర్ల జాబితా నుండి తక్షణమే తొలగించినట్లు వెల్లడించారు. విదేశీ పౌరులకు భారతీయ వోటరు కార్డులు లభించేలా వెనుకుండి సహకరించిన వ్యక్తులు, అధికారులపై క్రిమినల్‌ ‌చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురి కుటుంబ సభ్యుల పత్రాలపై కూడా తనిఖీలు జరుపుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి విదేశీయుల పేర్లు నమోదయ్యాయా అన్న కోణంలో దర్యాప్తు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *