తొలితరం తెలుగు కథా రచయిత్రి
మాండలికాన్ని హత్తుకున్న మాతృమూర్తి
మహాలక్ష్మి ముచ్చట్ల పలుకులమ్మ
మా ఊరి ముచ్చట్ల పంతులమ్మ
తెలంగాణా పల్లె కోయిలమ్మ
మన ఆచార్య పాకాల యశోదమ్మ
చదువులెన్నో చదివిన జ్ఞానశీలి
పదవులెన్నో నిర్వహించిన కార్యశీలి
తెలుగు భాషను ప్రేమించింది
తెలంగాణా యాసకు ప్రాణం పోసింది
కావ్యాలను పరిశీలించింది
పరిశోధనలు కావించింది
కమ్మని పదాలను కూర్చింది
కథలూ కైతలు రాసింది
ఉగాదికి ఊయలలు వేసింది
భావికకు భావనలను అద్దింది
పదాలనెన్నింటినో వెలికి తీసింది
మన పలుకుబడికి పట్టం కట్టింది
ఆమె రచనల్లో పల్లెతనం
ఆమె కథల నిండా మనిషితనం
అన్యభాషలను నేర్చింది
చిత్రకళనూ అభ్యసించింది
అక్షర సేద్యం చేసింది
భాషా సంపదలను పండించింది
సమాజ శ్రేయస్సును ఆశించిన ఈ మట్టి పరిమళం
మానవజాతి ప్రగతిని కాంక్షించిన తెలంగాణా ఆత్మగౌరవం
మన ఎచ్చమ్మ!
మన యశోదమ్మ!!
-డా.కొమర్రాజు రామలక్ష్మి
9849234725.
(ఆగస్టు 8న ఆచార్య పాకాల యశోదారెడ్డి గారి జయంతి సందర్భంగా)
9849234725.
(ఆగస్టు 8న ఆచార్య పాకాల యశోదారెడ్డి గారి జయంతి సందర్భంగా)





