ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి ‘పీఎం అభిమ్‌’

దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నకు పై సమాధానమిచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.32,961.10 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. తద్వారా 11,001 భవన రహిత సబ్ హెల్త్ సెంటర్-ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణం, బలోపేతానికి ఆమోదాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజారోగ్యం రాష్ట్ర అంశం కావడంతో పథకం అమలు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని, అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు సకాలంలో పరిపాలనా అనుమతులు, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడంతోపాటు సమీక్షా సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు, ఇతర పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా నిధుల సద్వినియోగం, ప్రాజెక్టుల వేగవంతమైన అమలును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి వివరించారు. బీబీనగర్ ఎయిమ్స్ తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాలకు కీలక తృతీయస్థాయి వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన సంస్థగా పనిచేస్తోందని తెలిపారు. ఇక్కడ ఇప్పటికే వైరస్ పరిశోధన, నిర్ధారణ ప్రయోగశాల, వన్ హెల్త్ ప్రాంతీయ సమన్వయ కేంద్రం, ఆల్ ఇండియా నెట్‌వర్క్ ప్రోగ్రామ్ ఆన్ వన్ హెల్త్, యోగ ఆధారిత మైండ్-బాడీ ఇంటర్వెన్షన్స్ పరిశోధన కేంద్రం, మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు, పరిశోధనా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *