కాలం పరిహసిస్తుంది
నీ వసంత వనం తుంచి
నాకు శిశిరం కట్టబెట్టానని

విధి విర్రవీగుతుంది
నీ స్వర తంత్రుల తెంచి
నిశీధి నిశబ్దం పరిచానని

చితి జ్వాల వెక్కిరిస్తుంది
నీ అణువణువు దహించి
భస్మ ధూమం మిగిల్చానని

మృత్యువు నవ్వుతుంది
నిష్కర్షగా నిను కబళించి
ఒంటరిగా నిలబెట్టామని

పాడు లోకం గర్విస్తుంది
పవిత్ర ప్రేమనుబందాన్ని
సజీవ సమాధి చేసామని

పాపం వాటికేం తెలుసు ?
నా ఊహల్లో  ఉన్నావాని
నా ఊపిరిలో దాగున్నావని

పాపం వాటికేం తెలుసు ?
నా హృదయ కోవెలలో…
ప్రేమ దేవతై కొలువున్నావని

నా గుండె గొంతుకలో..
ప్రణవ నాదమై పల్లవిస్తున్నావని

నా జీవన యానంలో..
వెన్నెల దీపమై ప్రకాశిస్తున్నావనీ

– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *