ఉద్యమకారుల గుర్తింపా? అగౌరవమా? చరిత్ర తారుమారా?

నిజానికి ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనేవారు, ఆ ఉద్యమం విజయం సాధిస్తే తమకు వ్యక్తిగతంగా ఒనగూరబోయే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాల్గొనరు. తమ ఆశయాల కోసం, తమ త్యాగం ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తు వికసిస్తుందనే ఆదర్శంతో పాల్గొంటారు. వలస వ్యతిరేక ఉద్యమ కాలానికీ, ప్రస్తుతానికీ మనుషుల విలువల చట్రాల్లో మార్పు వచ్చిన మాట నిజమే గాని, ఇప్పటికీ కొందరైనా ఆదర్శాల…



