హావిూలు నిలబెట్టుకోవడం మాకు ఎరుకే

  • రెండు హావిూలను ప్రారంభించింది హరీష్‌కు తెలీదా
  • ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలపై మంత్రి జూపల్లి ఆగ్రహం
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు కామన్‌ సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని..ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హావిూలను ప్రారంభించామని కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలవాటుందన్నారు. హరీష్‌ రావు వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్‌ ఇచ్చారు. శనివారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద మంత్రి జూపల్లి మాట్లాడుతూ…హరీష్‌రావు మైండ్‌ లేకుండా మాట్లాడుతున్నాడని, పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, రెండు రోజుల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏమనాలని, వీరికి అప్పుడే తొందర ఎక్కువైందన్నారు.
రెండు రోజుల్లో మూడు పథకాలు ఇంప్లిమెంట్‌ చేశామని, మొన్నటి వరకు ప్రగతి భవన్‌కి పోవాలంటే అవకాశమే లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయందని, రెండు రోజులకే గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా కనిపించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తానూ పాల్గొన్నానని, తెలంగాణ వొచ్చిన రోజు కంటే ఈరోజు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఫీలవుతున్నారని, అమరవీరుల ఆత్మ ఈ రోజు శాంతించిందని, ప్రజలు ఏ లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారో అవి నెరవేరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అలాగే అవినీతికి సంబంధించి బిఆర్‌ఎస్‌ జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *