కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం
న్యూ దిల్లీ, నవంబర్ 28 : తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు సోనియా గాంధీ మార్పు కోసం కాంగ్రెస్‌కి వోటేయాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. మార్పు కావాలి..కాంగ్రెస్ రావాని అన్నారు. ఎప్పటికీ ప్రజలకు అంకితమై ఉంటానని అన్నారు. నమస్కారం నా సోదరీమణులు మరియు ప్రియమైన తెలంగాణ సోదరులారా…నేను అందరి మధ్యకు రాలేకపోయాను కానీ హృదయాలకు చాలా దగ్గరయ్యాను.
ఈ రోజు నేను కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ తల్లి..అమరుల పుత్రుల కల నెరవేరేలా చూడాలని అన్నారు. మనం అందరం దొరల తెలంగాణను ప్రజా తెలంగాణగా మార్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కలలను నిజం చేసుకోండి. కు నిజమైన, నిజాయితీ గల ప్రభుత్వాన్ని, పాలనను అందించడానికి మేం సిద్ధంగా ఉన్నాము. రు నన్ను సోనియమ్మా అని పిలిచి అపారమైన గౌరవం, అప్యాయత ఇచ్చారు. నన్ను తల్లిలా చూసుకున్నారు. ఈ ప్రేమ, గౌరవానికి నేను ఎల్లప్పుడూ కు కృతజ్ఞుతగా ఉంటాను. ఎప్పటికీ కు అంకితమై ఉంటాను. తెలంగాణలోని మన సోదరీమణులు, తల్లులు, కొడుకులు, కుమార్తెలు, సోదరులు ఈసారి తమ శక్తినంతా వినియోగించి మార్పు తీసుకురావాలని అభ్యర్థిస్తున్నాను. కాంగ్రెస్‌కు వోటు వేయండి…అంటూ రాష్ట్ర ప్రజలకు సోనియా గాంధీ తన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.





