విజయం సాధించండిలా..
మనం మనసులో ఏదీ మనోసిద్ధితో అనుకుంటే అదీ సాధించే సత్తా మన సబ్ కాన్షియస్ మైండ్ కు ఉందని ప్రయోగ పరిశోధనలు మన ముందు ఋజువులు చూపుతున్నాయి. విజయం అనగానే బాల్యదశలోకి ఒక్కసారిగా మన మనసును తీసుకొని వెల్లండీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కదూ. పాఠశాలలో జెండా పండుగ రోజు నిర్వహించిన ఆటల పోటీలల్లో బహుమతిని సాధించిన తీయని జ్ఞాపకాలు మరువలేనివి. తరగతిలో మంచి మార్కులు సాధించడం, ఉద్యోగిగా ఉత్తమ అవార్డును సొంతం చేసుకోవడం ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు మన జీవితంలో చూసి ఉంటాం. విజయాల వల్ల డబ్బు, గౌరవం, పేరు ప్రతిష్టలు , కష్టానికి తగు ప్రతి ఫలం సాధించామన్న తృప్తి కలుగుతాయి.
ప్రతి మనిషిలో ఉండే ఆలోచన ఒక్కటే విజయం సాధించాలి. అందరికీ విజయం సిద్దిస్తుందా…. ఓటమి ఎదుర్కొనే వారు ఎవరూ. విజయం అనే పదాన్ని గంభీరంగా ఉచ్చరించగానే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా.. ఈ మధ్య తెలంగాణలో వి.ఆర్.ఓ. ఉద్యోగం కోసం నిర్వహించిన రాత పరీక్ష కోసం 11 లక్షల పై చిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి విజయం చెంతకు వస్తుందా….అందరిలో కొందరికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల కోసం, పై చదువులలో ఉన్నత అవకాశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలలో విజయం సాధించాలంటే ఏం చేయాలి….ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి రోజుకు ఉన్న 24 గంటల్లో 20 గంటల పాటు తీవ్రంగా శ్రమించేవారు ఉన్నారంటే అతి శయోక్తి కాదేమో .విజయం అంత సులభంగా లభించకపోవచ్చు కాని అసాధ్యమైందేమి కాదు. కఠోర దీక్ష పట్టుదల ఉంటే ఏదైనా సరే మన సొంతం అవుతుంది.
విజయం మీ సొంతం కావాలంటే…..
1.లక్ష్యంపై దృష్టిని కేంద్రీకరించాలి
2.విజయం సాధించాలనే ధృడ సంకల్పాన్ని కలిగి ఉండాలి
3.మనసులో ఉండే భయాన్ని అధిగమించాలి
4.తక్కువగా నిందించాలి మరియు ఎక్కువగా కృషి చేయాలి
5.మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, అసూయపడరాదు
6.ఇప్పుడే ప్రారంభించాలి7.మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరాదు
1. ఎస్ -లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి : విజయ సాధనలో ప్రధానమైనది ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యం పై ఎల్లప్పుడూ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి. ఒకటి లేదా రెండు రోజులు ప్రయత్నిస్తేనే విజయం లభిండం కష్టం. లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు, అపజయాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు అంతమాత్రానా కృంగి పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఓటమి నుండి కూడా విజయం సాధించడానికి కావలసిన మనోధైర్ఘ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆ అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం సాధన దిశగా ముందడుగులు వేస్తూ ఉండాలి.
2.విజయం సాధించాలనే ధృడ సంకల్పాన్ని కలిగి ఉండాలి: ఎల్లప్పుడూ విజయాన్ని సాధించాలనే దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. మన మనసులో బలంగా నిర్ణయించుకోవాలి, విజయం సిద్దించే వరకు వెనుకడుగు వేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా సాధ్యమైనంత మేరకు విజయం కోసం కష్టపడాలి. లక్ష్యసాధన కోసం నిరంతరం తపిస్తూ మన కృషి మనం చేస్తూ ఉండాలి.
3.భయాన్ని అధిగమించాలి : చాలా మందిలో అమ్మో ఇంత కష్టమైన పనిని నేను సాధిస్తానా అనే భయం మనసులో వెంటాడుతూ ఉంటుంది. గతంలోని ఓటమిలు, వైఫల్యాలు మన మనసును భయపడేలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి ఓటమిలో, ప్రతి వైఫల్యం వెనక దాగి ఉన్న రహాస్యాలను అవగాహన చేసుకోగలిగితే మనలో దాగి ఉన్న సామర్థ్య్దాలను మెరుగుపరచు కోవచ్చు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో భయాన్ని చాలా సులభంగా అధిగమించవచ్చు. ఓటమికి భయపడాల్సిన పని లేదు. ఓటమితోటీ విజయానికి మెట్లను ఏర్పరుచుకోగలిగే స్తాయికి ఎదగాలి.
4.తక్కువగా నిందించాలి మరియు ఎక్కువగా కృషి చేయాలి: ఇతరుల యొక్క వైఫల్యాలు మన విజయానికి గుణపాఠాలుగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క వైఫల్యాలపై తక్కువ ఆలోచించడం చేయాలి. ఆ వైఫల్యం వెనుక దాగి ఉన్న కారణాలను పరిష్కార మార్గం కోసం ఎక్కువగా కృషి చేయాలి. ఇతరులను నిందించడం తక్కువగా చేయాలి, మనలోని శక్తి సామార్థ్య్దాలను మెరుగుపరచుకొంటూ లక్ష్యసాధన కోసం ఎక్కువ కృషి చేయాలి.
5. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి, అసూయపడరాదు: ప్రపంచంలో ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. మనలో ఉన్న నైపుణ్యాలను మనకు మనముగా ఎల్లప్పుడూ ప్రోత్సహించుకుంటూ ఉండాలి. మనలో లేని నైపుణ్యాలను ఇతరులలో గమనించినపుడూ అసూయ పడకుండా మన మనసుకు తగు సూచనలను జారీ చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకం. ఇతరులతో పోల్చుకోవడం అనేది దరిదాపులకు రానీయకూడదు. మనలో ఉన్న సామార్ధ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ఆత్మవిశ్వసాన్ని దృఢపరచుకోవాలి.
6. ఇప్పుడే ప్రారంభించాలి : విజయ సాధనలో చివరి ప్రయత్నం అనే మాటను దరి చేరనీయకూడదు. విజయం సాధించడానికి పనిని ప్రారంభించడాని నిర్దిష్ట సమయం కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో పనిని ఈ సమయంలోనే, ఇప్పుడే ప్రారంభించాలి. సరైన మార్గదర్శకత్వం కోసం ఒక్క మెంటారును ఎంచుకోవాలి.
7. మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరాదు : లక్ష్యసాధనలో ఎన్నో రకాల ఒడి దొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సానుకూల ఆలోచనలను మనసులో పెంపొందించుకోవాలి. సాధించిన వ్యక్తుల యొక్క స్టోరీలను చదవాలి. మహానీయులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి. లక్ష్యసాధనకు ప్రణాళికను ఏర్పరుచుకోవాలి. అభ్యాసనను తీవ్రతరం చేయాలి. ఫలితం గురించి ఆలోచనలు చేయకూడదు. విజయసాధన కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. ప్రతి కూల ఆలోచనలను దరిచేరనీయకుండా సానుకూల ఆలోచనలతో ముందుకు వెల్లితే విజయం సొంతం అవుతుంది. ఎన్నీ రకాల అపజయాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదు. మిమ్మల్ని చూసి విజయం కూడా భయపడి మీదగ్గరకు చేరేలా పట్టుదలతో కృషి చేయండి. విజయోస్తూ…
-డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి,
స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్, సైకాలజిస్ట్
ఫ్యామిలీ కౌన్సెలర్
సెల్: 9703935321





