విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవేలో మార్పులు

  • కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల
  • రహదారుల నిర్మాణానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడి

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాల వి•దుగా హైవే వెళ్తునందున బైపాస్‌ ‌రోడ్డు నిర్మించాలని కోరామని, ఖమ్మం చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించలేక రింగ్‌రోడ్డును పక్కన పెట్టేసిందని తుమ్మల విమర్శించారు.

భద్రాచలం పట్టణంలోనూ కొన్ని రోడ్ల విస్తరణకు ఆమోదం లభించిందని, భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు.. జగ్గయ్యపేట నుంచి వైరా, తల్లాడ వి•దుగా కొత్తగూడెం వరకు 4 లైన్ల హైవేకి ప్రతిపాదనలు పంపించామని మంత్రి తెలిపారు. కోదాడ-ఖమ్మం మధ్య రూ.1.039 కోట్లతో నిర్మించిన 32 కి.వి• రహదారి ఆగస్టు 30 కల్లా అందుబాటులోకి వొస్తుందన్నారు. ఖమ్మం-కొరివి మధ్య రూ.445 కోట్లతో 37 కి.వి• రహదారి నిర్మాణానికి గతంలోనే అనుమతులిచ్చామని తెలిపారు. దీని నిర్మాణానికి మరో రెండేళ్లు పడుతుందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *