రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి

  • పరస్పర విమర్శలతో ఎదురుదాడి
  • తమదంటే తమదే గెలుపని మూడు ప్రధాన పార్టీల ధీమా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : తెలంగాణలో రాజకీయ సవ్నికరణాలు మారుతున్నాయి.కొత్తగా రాజకీయ పార్టీలు బలప్రదర్శనలతో ఎండాకాంలో వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల కాలం కావడంతో వోట్ల కోసం నేతలు ప్రజలను చేరుకుంటున్నారు. తమ పార్టీ విధానాలు చెబుతున్నారు. బిజెపి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటోంది. కాంగ్రెస్‌ రాహుల్‌ ప్రధాని అవుతాడని అంటుంది. ఇరు పార్టీలు ఎవరికి వారు తమ పార్టీల ప్రత్యేకతను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.  బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తదితరుల ప్రచారం, .కాంగ్రెస్‌ , బిఆర్‌ఎస్‌ ప్రచారాలు కలసి రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఇంతకాలం బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదనుకుంటున్న దశలో అనూహ్యంగాకాంగ్రెస్‌ దూసుకుని వచ్చి అధికారం చేజిక్కించు కుంది. దీంతో ఇప్పుడు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, ఫోన్‌ ట్యాపింగ్‌ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రేవంత్‌ రెడ్డి సిఎం అయ్యాక  మరింత వేడి రాజుకుంది. అనూహ్యంగా ఒక్కసారిగా దూసుకుని రావడంతో రాజకీయాలు మారుతున్నాయి.

ఆయన తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతానని అంటున్నారు. అయితే తాజా రాజకీయాలు ఏ మేరకు ప్రజల అవసరాలను, ఆకాంక్షలను తీరుస్తాయన్నది అంచనా వేయాల్సి ఉంది. వీరి పోరుబాటులో రాజకీయ రణాలు తప్పప్రజల ఆకాంక్షలు మాత్రం తీరడంలేదు. ఇంతకాలం అధికార బిఆర్‌ఎస్‌కు తిరుగు లేకుండా పోయింది. దీనికితోడు బిజెపి కేవలం విమర్శలకే పరిమితం కావడం మినహా ప్రజలపై పెద్దగా ప్రభావశీలంగా పనిచేయలేక పోయింది. వారు ఎంతగా ప్రయత్నించినా కేంద్ర నిర్ణయాలతో ప్రజలు వ్యతిరేకతను చూపుతున్నారు. కెసిఆర్‌ వ్నిద ఉన్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునే ప్రతయ్నం తప్ప దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్రజలకు జరగుతున్న ప్రయోజనాలు కానరావడం లేదు. రేవంత్‌రెడ్డి సిఎం కావడంతో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. దీంతో కాంగ్రెస్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కనిపించ బోతున్నాయి. యువకుడైన రేవం పట్ల యూత్‌ అట్రాక్ట్‌ అవుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులు కూడా సద్దుమణిగాయి. గతంలో లాగా గోచీ గుంజే ప్రయత్నాలు ఆదిలోనే అడ్డుకట్ట వేస్తున్నారు. ఎందుకంటే మారుతున్న రాజకీయ పరిణామ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా రేవంత్‌ సవ్నికరణాలను మార్చుకునే అవకాశం కనిపిస్తూ ఉంది.

యూత్‌లో మంచి పాలోయింగ్‌ ఉండడం, మాస్‌ లీడర్‌గా పేరుండడం, మంచి వక్త కావడం ఆయనకు కలసి వొచ్చే అవకాశంగా మారింది.  అంతే గాకుండా కాంగ్రెస్‌ను వీడిని వారు సైతం వెనక్కి వొచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌ అసంతృప్తులు కూడా ఇప్పుడు రేవంత్‌ను అనుసరించడం తప్ప చేసేదేవ్ని లేదు. అలాగే వైఎస్‌ అభిమానులు కూడా రేవంత్‌ వెంటే ఉండడానికి ఇష్ట పడతారు. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉన్న అనేకమంది ఉద్యమకారులు, యువత, నిరుద్యోగులు ఇప్పుడు రేవంత్‌కు జై కొడుతున్నారు. ఉద్యమ సమయంలో అందరినీ కదిలించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సైతం కాంగ్రెస్‌ పక్షంలో ఉన్నారు.

దోపిడీ నుంచి రైతులకు రక్షణ కోసం కొత్త ఉద్యమానికి అందరూ ఏకం కావాలని కోదండరామ్‌ అంటున్నారు. ఇకపోతే తెలంగాణలో కెసిఆర్‌ రాజకీయ వ్యూహాలన్నీ ఎదరుతిరిగాయి. అధికారం కోల్పోవడంతో ఎదుటి పక్షాలను దునుమాడే లక్ష్యంతో బిఆర్‌ఎస్‌ గతంలో ఎప్పుడూ లేనంతగా దృష్టి సారించింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో  గెలుపు కోసం  వ్యూహాత్మకంగా అడుగుల వేసేలా పార్టీ శ్రేణులను కెసిఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. రైతులకు మద్దతుగా నిలవడం  వంటి నిర్ణయాలు కూడా రాజకీయంగా కలసివచ్చేవే.  అయితే కెసిఆర్‌ ఇప్పుడు తాజా రాజకీయల నేపథ్యంలో మరోమారు చురుకుగా వ్యవహరించడం అవసరమని గుర్తించారు. తద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెడతారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *